ఓయూ సభను విజయవంతం చేయాలి
సూర్య రుద్రంగి: ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 6న నిర్వహించనున్న మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎమెసేఫ్) జాతీయ ప్రతినిధుల సదస్సును విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ రుద్రంగి మండల ఇంచార్జ్ దయ్యాల నారాయణ
మాదిగ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో శనివారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దయ్యాల నారాయణ మాట్లాడుతూ. మాదిగ ఉప కులాల హక్కుల సాధన కోసం,ఎస్సీ వర్గీకరణ త్వరితగతిన అమలు కావడం కోసం విద్యార్థి లోకం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మార్గనిర్దేశంలో ఓయూలో జరిగే ఈ జాతీయ సదస్సు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని పేర్కొన్నారు. విద్యా రంగంలో మాదిగ విద్యార్థుల హక్కుల సాధనపై ఈ సభలో చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. రుద్రంగి మండలం నుండి మాదిగ బంధువులు, మేధావులు, యువకులు మరియు విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సింగారపు గంగాధర్, ఎంఎస్పి మండల అధ్యక్షుడు దయ్యాల నరేష్, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షుడు రోమల అశోక్ మండల అధికార ప్రతినిధి దయ్యాల రమేష్, గౌరవ అధ్యక్షులు తర్రే మనోహర్, దయ్యాల పెద్దులు కార్యవర్గ సభ్యులు దయ్యాల శ్రీనివాస్, అక్కేనపల్లి దేవయ్య, నేరాళ్ల శ్రీనివాస్, అక్కినపల్లి నరేష్, రాగుట్ల గంగరాజం, సింగారపూ శ్రీనివాస్, దయ్యాల దినేష్, తదితరులు పాల్గొన్నారు.