BREAKING
వైసీపీ నుంచి టీడీపీ లోకి భారీ చేరికలు .....పదవుల కోసం కాదు... చిన్న శ్రీను వెంటే...... 1998 తర్వాత గరిష్ట స్థాయికి గిల్ట్ ఈల్డ్స్, కుప్పకూలిన బ్యాంకుల షేర్లు 30వ వార్డు సమస్యలపై శిరీషా ఫోకస్ కిల్‌సెక్ హ్యాకర్ గ్రూప్ 16 ఏళ్ల లీడర్‌ను అరెస్ట్ చేసిన స్పానిష్ పోలీసులు కోనసీమ వాసుల దశాబ్దాల కలకు ఊతం.. నోటీస్ ఇవ్వకుండానే భూమి బదలాయింపు ఎలా? * తీవ్ర అన్యాయం జరిగిందంటూ భావిశెట్టి శేఖర్ ఆరోపణ ధాన్య నిల్వల్లో రసాయన మందులకు ప్రత్యామ్నాయం ఘనంగా జీఎంసీ బాలయోగి 75వ జయంతి వేడుకలు.. యూఈ వాణిజ్య కమిషనర్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాజీ లోక్‌సభ స్పీకర్ బాలయోగి ఆశయ సాధనకు పునరంకితం అవుదాం..: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు.. జనసేనలోకి చేరిన వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో భారీగా పార్టీ కండువాలు కప్పుకున్న నాయకులు బాలయోగితో అనుబంధం... మరచిపోలేని జ్ఞాపకాలు..: ఎమ్మెల్సీ కుడుపూడి... గంజలి బడే సాబ్ దర్గాలో సోమనాథ్ అన్నదానం ఘనంగా ప్రారంభమైన జాతర మహోత్సవం -పోలేరమ్మ జాతరతో పులకించిన వెంకటగిరి -జాతరకు రాష్ట్ర పండుగా హోద... 50 లక్షలు మంజూరు -ప్రభుత్వ లాంఛనాలతో అమ్మవారికి పట్టు వస్త్రాలు -పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి - అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం - జై పోలేరమ్మ తల్లి నినాదాలతో మారి మ డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్ 13 లక్షల అవినీతి స్కాం

నల్లమల్ల అటవీ గ్రామాల పునరావాసానికి పకడ్బందీ చర్యలు , జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

Select Suryaa Now
నల్లమల్ల అటవీ గ్రామాల పునరావాసానికి పకడ్బందీ చర్యలు  , జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్

నల్లమల్ల అటవీ ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోర్ ఏరియాలో నివసిస్తున్న కుటుంబాల స్వచ్ఛంద పునరావాసానికి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తెలిపారు.పునరావాస ప్రక్రియలో భాగంగా బుధవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో 36 మంది లబ్ధిదారులకు 250 గజాల చొప్పున ఇళ్ల స్థలాల పట్టాలను జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్రతో కలిసి కలెక్టర్ పట్టాలను అందజేశారు.అమ్రాబాద్ మండలంలోని సార్లపల్లి, కుడిచింతలపల్లి, తాటిగుండాల, కొల్లంపెంట గ్రామాలకు చెందిన పునరావాస లబ్ధిదారుల కోసం కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం బాచారం సమీపంలో పునరావాస ప్రాంతాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

పునరావాస ప్రక్రియలో ముఖ్యాంశాలు

- మొత్తం 417 కుటుంబాలు పునరావాస ప్యాకేజీని స్వీకరిస్తున్నాయి.
- 257 కుటుంబాలకు 250 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు.
- 160 కుటుంబాలు రూ.15 లక్షల పునరావాస ప్యాకేజీని స్వీకరించాయి.
- పునరావాస ప్రాంతంలో తాగునీరు, విద్యుత్, రహదారులు తదితర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
- పునరావాస కుటుంబాలకు అర్హత మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
- పునరావాస ప్రక్రియలో లబ్ధిదారులకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు సిద్ధమైన అటవీ గ్రామాల ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు, సురక్షితమైన నివాస వసతి కల్పించడమే పునరావాస ప్రక్రియ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని కొత్త ప్రాంతంలో స్థిరపడుతూ పిల్లల విద్య, కుటుంబ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని లబ్ధిదారులను కోరారు.

కార్యక్రమంలో రెవెన్యూ, అటవీ, పంచాయతీరాజ్, సంక్షేమ శాఖల అధికారులు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పునరావాస లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

పి .విజయ్ కుమార్ నాగరకర్నూల్ ప్రతినిధి, సూర్య న్యూస్: