కొత్తగూడలో రూ.50 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం
కందుకూరు మండలంలోని కొత్తగూడ గ్రామపంచాయతీ పరిధిలో మర్రి పెద్ద జంగారెడ్డి కమాన్ నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొక్క సంజీవ రెడ్డి, వార్డు సభ్యులు సౌడపు శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో హెచ్ ఎం డి ఏ నిధులతో రూ.30 లక్షలతో సీసీ రోడ్డు, రూ.20 లక్షలతో డ్రైనేజీ
మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ నాయక్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి,మాజీ జడ్పీటీసీ, ఏనుగు జంగారెడ్డి పనులను ప్రారంభించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వారు తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి నిధులు మంజూరు చేయించడంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి కేఎల్ ఆర్ చూపిన చొరవ అభినందనీయమన్నారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాణాప్రతాప్ రెడ్డి, నాయకులు, వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొక్క భూపాల్ రెడ్డి,గంగుల ప్రభాకర్ రెడ్డి,ఉప సర్పంచ్ రవీందర్,వార్డ్ సభ్యులు తాళ్ల బాలేష్,ఎండి అంజద్,బొక్క దీక్షిత్ రెడ్డి, మమత శ్రీకాంత్ రెడ్డి,పూజిత పరమేష్,ఇందిరమ్మ కమిటీ చైర్మన్ కుమ్మరి కృష్ణయ్య,అంజయ్య,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బురాన్,రాజశేఖర్ రెడ్డి,వినోద్ చారి,జమీల్,నాగేశ్వర్,మోసిన్,సురేష్ గౌడ్,మహేష్ గౌడ్,మహేశ్వర్ రెడ్డి,శేఖర్,రవి తదితరులు పాల్గొన్నారు.
-తోకల శ్రీనివాస్: మేజర్ న్యూస్, కందుకూరు.