కోళ్ల ఫారం వ్యర్ధాల వాసనతో మేము భరించలేం కోళ్ల ఫారం వద్ద గ్రామస్తుల ఆందోళన
కోళ్ల ఫారం వ్యర్ధాల వాసనతో మేము భరించలేం
కోళ్ల ఫారం వద్ద గ్రామస్తుల ఆందోళన
కుకునూరుపల్లి, సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల పరిధిలోని బొప్పాయిపల్లి చిన్న కిష్టాపూర్ గ్రామ శివారులోని జానకి కోళ్ల ఫారం నుండి భరించలేని వ్యర్ధాలతో దుర్వాసన ఈగలతో వెలువడుతున్నడంతో రెండు గ్రామాల ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా దాని గురించి పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఇరు గ్రామల ప్రజలు ఆరోపిస్తున్నారు. కోళ్ల ఫారం సమీపంలో పచ్చి కోడేరు ఆరబెట్టడంతో భగ్గుమన్న దుర్వాసన వెదజల్లడంతో చుట్టుపక్కల ఉన్న పొలల్లో వ్యవసాయ పనులు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు గ్రామాల ప్రజలు దుర్వాసన ఈగలతో రోగాల బారిన పడుతున్నామని
ఆరోపిస్తున్నారు. నిబంధనలకు మేరకు గత నెలలో మూడుసార్లు గ్రామాల్లో వీధుల్లో దోమలు ఈగలు ప్రబాల కుండ పాగింగ్ చేయాల్సి ఉంది. పౌల్ట్రీ ఫారం యజమాన్యం ఈ విషయంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆయా గ్రామల ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అందించి దుర్వాసన నిలుబడుతున్న కోళ్ల ఫారాలపై చప్రమదకరం కోళ్ల పారాలపై చర్యలు తీసుకొని విధిగా పాగింగ్ చేయించి చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.