BREAKING
వైఎస్ఆర్సీపీ కార్యాలయ స్థలాన్ని స్మశాన వాటికకు కేటాయించడంపై అంబటి ఆగ్రహం కరెంటు కోతలతో ఎండిపోతున్న పంటలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు..... సంగారెడ్డి జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం కీలకం: ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేదలకు విద్యే ఆస్తి-మంత్రి నారాయణ. విద్యుత్తు సమస్యలు పరిష్కరించి సీసీ ద్వారా పత్తి కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే కు వినతి గేమింగ్ కంపెనీలపై యూయూ మద్దతుతో దర్యాప్తునకు దిగిన ఇటలీ దక్షిణాది జర్నలిస్టులకు ప్రాధాన్యత కల్పించాలి సాహిత్యంలో నోబెల్ పురస్కారం: కెనడా రచయిత్రి 'అన్నె కార్సన్'కు అవార్డు సమయపాలన పాటించని రెవెన్యూ అధికారులు - దర్శనమిస్తున్న కాళీ కుర్చీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి కర్షకుని కనులలో కన్నీళ్లు.. కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కష్టాలు! చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి నాయకుడు పనిచేయాలి టిడిపి ట్రైనింగ్ రిసోర్స్ పర్సన్స్‌తో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మీట్ అండ్ గ్రీట్ ఐ టీడీపీ శిక్షణ తరగతుల్లో పామూరు నేతలు

కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా

Select Suryaa Now
కెజీబీవీ జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారం అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ యోగితా రాణా ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కెజీబీవీ) జూనియర్ కళాశాలను గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా తరగతి గదులు, వసతి గృహం, వంటగది, భోజన ప్రదేశం, పరిసరాలను పరిశీలించి విద్యార్థినులకు అందుతున్న మౌలిక వసతులు, విద్యాబోధన, వసతి, భోజనం తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారి చదువు, భోజనం, వసతి సదుపాయాలు, ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు.విద్యార్థినులు లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని యోగితా రాణా సూచించారు. కళాశాలలో ఏవైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులు, అధికారుల దృష్టికి ధైర్యంగా తీసుకురావాలని అన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ఆమె, భోజనం నాణ్యత, రుచిని పరిశీలించారు. ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. వంటగది, భోజన ప్రదేశం, పరిసరాల్లో పరిశుభ్రతను నిరంతరం పాటించాలని, ఆహారం తయారీ, నిల్వ, వడ్డింపులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని సూచించారు. విద్యార్థినుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో మంద మకరంద్, విద్యాశాఖ అధికారి మాధవి, కళాశాల ప్రిన్సిపల్ దీప్తి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.