BREAKING
విక్రమార్కతో ఖతార్‌లోని భారత రాయబారి భేటీ సుల్తాన్‌పూర్‌లో పత్తి రైతులతో TGSPDCL సీఎండీ ముఖాముఖి అమ్మవారి దయవల్ల అంతా మంచే జరుగుతుంది... ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాల్సిందే చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసం హేయమైన చర్య మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి-జీడికల్ సర్పంచ్ కొండబోయిన మమత సంపత్ యాదవ్ సివిల్‌ వివాదాల్లో జోక్యం ఆరోపణలు.. ఘట్‌కేసర్‌ సీఐ బాలస్వామి సస్పెన్షన్‌ గుండ్లకమ్మను హరితహారంగా చేయటమే లక్ష్యం. మాజీ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు. చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై అశ్వారావుపేట రజక సంఘం ఖండన మదనపల్లెలో దారుణం.. భార్యను బీర్ బాటిల్‌తో పొడిచి చంపిన భర్త ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ పోలీసుల అదుపులో లేడీ డాన్ కోనేటి సులోచన! అశ్వారావుపేట ఎస్‌హెచ్‌ఓగా సాయి కిషోర్ రెడ్డి* గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ కనకదుర్గమ్మకు రూ.75 లక్షల విలువైన స్వర్ణ కిరీటం బహూకరణ

ఇంద్రకల్ శివారులో ఆటో బోల్తా 15 మందికి తీవ్ర గాయాలు, చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు

Select Suryaa Now
ఇంద్రకల్ శివారులో ఆటో బోల్తా 15 మందికి తీవ్ర గాయాలు, చికిత్స కోసం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు

ఆటో బోల్తా పడటంతో 15 మందికి తీవ్ర గాయాలైన సంఘటన తాడూరు మండల పరిధిలో ని ఇంద్రకల్ శివారులో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గుడిపల్లి గ్రామానికి చెందిన ఆటోలో పత్తి తీసేందుకు  కూలీలతో యాదిరెడ్డిపల్లి గ్రామానికి వెళుతుండగా ఇంద్రకల్ శివారులో ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో  తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న  15 మందికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో జనరల్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.. జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో చాలామందికి తీవ్ర గాయాలు  అయ్యాయి.. ఆటోలో పరిమితికి మించి కూలీలను చేరవేస్తున్న సంబంధిత పోలీసు, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడంతోనే తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు…  సంఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు..

పి. వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్ , సూర్య న్యూస్