BREAKING
కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం: పీఠాధిపతి అరీఫుల్లా హుస్సేనీ ప్రత్యేక భేటీ! రాజధాని పనులపై నిర్మాణ సంస్థలతో సీఎం చంద్రబాబు సమీక్ష: 21 కి.మీ ఎత్తులో డీఆర్‌డీవో హై-ఆల్టిట్యూడ్ ఎయిర్‌షిప్ పరీక్ష విజయవంతం: దేశీయ హెచ్‌పీవీ వ్యాక్సిన్ ‘సెర్వావాక్’కు డబ్ల్యూహెచ్‌వో గుర్తింపు... కెన్యాలో తొలి ఎబోలా కేసు నిర్ధారణ: చికిత్స పొందుతూ రోగి మృతి.. అప్రమత్తమైన ఆరోగ్యశాఖ, డబ్ల్యూహెచ్‌వో! ఆశ వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి :ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కు వినతిపత్రం పేదలకు ప్రయోజనం చేకూర్చే ‘మీ మార్ట్’ ప్రారంభం రామన్నపాలెంలో పంచాయతీ కార్యదర్శులు, హరిత రాయబారులకు శిక్షణ కార్యక్రమం పొలం సంఘం ది - రిజిస్ట్రేషన్ వేరొకరికి ...:ఈతకోట బాబా నగర్ కాలనీ వాసులు కలెక్టర్ కు ఫిర్యాదు నేటి రాశి ఫలాలు – 7 అక్టోబర్ 2026 (బుధవారం) మామునూరు ఎయిర్ పోర్టుకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టాలి నేటి పంచాంగం 7 అక్టోబర్ 2026,బుధవారం ఉర్సు రావణాసుర వధ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయి గిరిజన చట్టాలకు తూట్లు

బీసీ బాలుర వసతి గృహంలో తహసీల్దార్ అశోక్ ఆకస్మిక తనిఖీ

Select Suryaa Now
బీసీ బాలుర వసతి గృహంలో తహసీల్దార్ అశోక్ ఆకస్మిక తనిఖీ

బీసీ బాలుర వసతి గృహంలో తహసీల్దార్ అశోక్ ఆకస్మిక తనిఖీ

టెన్త్ విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి.. పరీక్షల సన్నద్ధతపై ఆరా

కొండాపూర్ : తోగర్ పల్లి  గ్రామంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తహసీల్దార్ అశోక్ ఆకస్మికంగా సందర్శించారు. వసతి గృహంలోని విద్యార్థుల చదువు, పరీక్షల సన్నద్ధతపై ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు.పదో తరగతి చదువుతున్న విద్యార్థులతో తహసీల్దార్ అశోక్ నేరుగా మాట్లాడారు. పరీక్షలకు సిద్ధమవుతున్నారని, నెలనెలా నిర్వహించే పరీక్షలను ఏ విధంగా రాస్తున్నారని, చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. చదివిన విషయాలను అర్థం చేసుకుని పునశ్చరణ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

చదువుతోనే మంచి భవిష్యత్తు..

పదో తరగతి విద్యార్థులు ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని ఎంతో కీలకంగా తీసుకుని కష్టపడి చదవాలని అశోక్ సూచించారు. చదువుతోనే మంచి భవిష్యత్తుకు బాటలు పడతాయని, పదో తరగతిలో మంచి మార్కులు సాధించి   తమ గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం వసతి గృహంలో విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతి, ఇతర సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీసి, సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

( రాజు కొండపూర్ మండలా రిపోర్టర్)