అవినీతికి అడ్డగా మారిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయం
అవినీతికి కేంద్రంగా మారిన
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం!
- రెవెన్యూ అధికారుల చేతివాటం పై ప్రజల్లో ఆగ్రహం
. తాయిలాలు సమర్పిస్తేనే ఫైళ్లు కదులుతాయి
- మామూళ్ల మత్తులో జూగుతున్న అధికారులు
- భూరీసర్వేకు రూ.20 లక్షల లంచం డిమాండ్
- ఏసీబీకి ఫిర్యాదు..
లంచం తీసుకుంటుండగా
- రెడ్ హ్యాండ్ డెడ్ గా సర్వేయర్ పట్టివేత
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ అవినీతి ఆరోపణలు, రెవెన్యూ అధికారుల వేధింపుల వ్యవహారాలు రోజురోజుకు చర్చనీయాంశంగా మారుతున్నాయి. భూముల సర్వేలు, రెవెన్యూ సంబంధిత పనుల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. లంచం ముట్ట చెప్పితే గాని పని కాని పరిస్థితి తహసీల్దార్ ఆఫీసులో నెలకొన్నది. మండల పరిధిలో భూ వివాదాలు ఎక్కువ ఉండడంతో వాటి పరిష్కారం కోసం రెవెన్యూ అధికారుల సంప్రదించగా వారి చేతివాటం లేకుండా పనులు జరగకపోవడంతో విసిగిపోయిన బాధితులు అధికారుల తీరుపై అసంతృప్తి చెంది ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. గతంలో మండల పరిధిలోని గౌరెల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమి సమస్యను పరిష్కరించాలని అప్పటి తహసీ ల్దార్ కు ఫిర్యాదులు పెట్టుకొని ఏళ్ల పర్యంతం ఆఫీసులో చుట్టూ తిరిగిన ఆ రైతు భూ సమస్య పరిష్కరించకపోవడంతో విసిగిపోయిన రైతు 2019 లో తహసీల్దార్ విజయ రెడ్డి ని పెట్రోలు పోసి అతను నిప్పంటించుకున్న ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటన జరిగిన కొన్ని ఏళ్లలోనే ఇదే తహసీల్దార్ ఆఫీస్ చెందిన అధికారులు రూ. 20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
రూ.30 లక్షల లంచం డిమాండ్?
మండల పరిధిలోని పసుమాముల గ్రామం సర్వే నంబర్ 137/2కు సంబంధించిన సర్వే నివేదిక జారీ చేసేందుకు రూ.30 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, రూ.20 లక్షల లంచం తీసుకుంటూ మండల సర్వేయర్ పట్టుబడిన ఘటన కూడా రెవెన్యూ శాఖలో అవినీతి వ్యవహారాలపై చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారుల పాత్ర, కేసు పురోగతిపై సంబంధిత శాఖ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
గతంలో రైతుపై పెట్రోల్‌తో దాడి
గతంలో గౌరెల్లికి చెందిన రైతు విజయరెడ్డిపై పెట్రోల్‌తో దాడి జరిగిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. భూ సంబంధిత వివాదాలు, రెవెన్యూ వ్యవహారాల నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించిన కారణాలు, నిందితుల వివరాలు అధికారిక ఆధారాలతో నిర్ధారించాల్సి ఉంది.
ప్రజలకు అందని సేవలు.. అధికారులపై చర్యలేవీ?
ఒకప్పుడు నిత్యం ప్రజలతో సందడిగా కనిపించే తహసీల్దార్ కార్యాలయం ప్రస్తుతం ప్రజలు రావడానికి కూడా వెనుకంజ వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ రెవెన్యూ సేవల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు పారదర్శకంగా, నిర్ణీత సమయంలో సేవలు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. అవినీతి ఆరోపణలు, వేధింపుల ఫిర్యాదులపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి తావులేకుండా చర్యలు తీసుకోవడం, బాధితులకు న్యాయం చేయడం, బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టడం అత్యవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రిపోర్టర్ : దుబ్బాక యాదయ్య..
అబ్దుల్లాపూర్ మెట్, మేజర్ న్యూస్...