♊ మిథున రాశి (Gemini) Mithuna Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మిథున రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani
మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)
ప్రారంభంలో ఆత్మీయుల కొరకు మిత్రులతో, సంతాన వర్గంతో కలసి వినోదాలు, వ్యక్తిగత షాపింగ్లు ఖర్చులు అధికం. ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆర్థిక అంశాలు అనుకూలం, బంధు మిత్రుల కలయిక. మాటలలో నిదానం అవసరం. ఉపాసన పెంచుకుంటూ హృదయాం దోళన అధిగమించాలి. మధ్యలో అధికశ్రమతో ఉద్వేగాలు అధిగమిస్తు, రోగనిరోధకశక్తి పై దృష్టి, పూర్వ బకాయిలు పొందే ప్రయత్నాలు. దంత, నేత్ర ఆరోగ్య శ్రద్ధ. వారాంతం సంఘములో గుర్తింపు గౌరవం, ఆర్థిక విషయాలు, మాటవిలువ అనుకూలం. భాగస్వామి, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం. వృత్తి వ్యాపార విషయాలలో శ్రమతో ఆశించిన వృద్ధి. దత్తాత్రేయ ఆరాధన మేలు.