కోనసీమ జెడ్పీ చైర్మన్ రేసులో "కప్పల సునీల్"
ఆలమూరు మేజర్ న్యూస్ ; డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ తొలి చైర్మన్ రేసులో రామచంద్రాపురం 13వ అదనపు జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కప్పల సునీల్ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ పదవి జనరల్ కు కేటేస్తారని భావించి చాలామంది కూటమి పార్టీలకు చెందిన కాపు నాయకులు పోటీపడ్డారు.అయితే ఎస్సీ జనరల్ కు రిజర్వ్ కావడంతో సునీల్ పేరు తెరపైకి వచ్చింది. ఆలమూరుకు చెందిన ఈయన న్యాయవాది వృత్తిలో అతి తక్కువ సమయంలోనే విశేష గుర్తింపు పొందారు.
అలాగే తెలుగుదేశం పార్టీ పదవిలో ఉంటూ పార్టీ కష్టకాలంలో అండగా నిలిచారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ముఖ్య అనుచరుడుగా ఉన్నారు.గోదావరి మధ్యలో ద్వీపంలో ఉండే ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన సునీల్ ఎన్నో ఇబ్బందులను ఎదురించి ఆర్థికంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. అనేక మంది ప్రముఖ న్యాయవాదులు వద్ద శిక్షణ పొంది ఆ వృత్తిలో పటిష్టమైన అవగాహన తెచ్చుకున్నారు.
ఆలమూరు కోర్టులో దశాబ్ద కాలంగా తిరిగి లేని ఆధిపత్యాన్ని సాధిస్తూ వచ్చారు.కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామచంద్రపురం 13వ అదనపు జల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాధ్యతలు చేపట్టి విశిష్ట సేవలు అందిస్తున్నారు. అనేక కేసులలో శిక్షలు వేయించడంతో ఆగష్టు 15 న ఉత్తమ సేవా పురస్కారాన్ని కూడా కలెక్టర్ మహేష్ కుమార్ చేతులమీదుగా అందుకున్నారు.అలాగే సేవా కార్యక్రమాలు చేపట్టడంలోనూ ముందుంటారు.చిన్న వయసులో ఆలమూరు బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా సునీల్ ఎన్నికయ్యారు.
టిడిపి లీగల్ సెల్ లో కీలకంగా..
తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ విభాగంలో సునీల్ కీలకంగా ఉన్నారు.పదిహేను సంవత్సరాల క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అనంతరం రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పదవి చేపట్టారు. గత సార్వత్రిక ఎన్నికలలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ త్రి మెన్ కమిటీ సభ్యునిగా ఉన్నారు. ఇలా టిడిపి పార్టీలో పదవులు చేపడుతూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు న్యాయపరంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు.
అందుకునే ఈ కీలకమైన జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ భాద్యతలు అప్పగించారు. ప్రజల పక్షాన నిలిచే సునీల్ జెడ్పీ చైర్మన్ గా ఉంటే కూటమి ప్రభుత్వానికి కూడా మంచి గుర్తింపు వస్తుందని చెప్పవచ్చు.ఇక ఈయన కుమార్తె కప్పల సుజాష్మిని కూడా విశాఖపట్నం దామోదర సంజీవయ్య జాతీయ లా యూనివర్సిటీలో విద్యాబ్యాసం మరో రెండు నెలల్లో పూర్తి చేస్తున్నారు.అలాగే కుమారుడు సందీప్ రాజ్ అమెరికాలో ఉన్నత చదువులు ఉద్యోగం చేస్తున్నారు.