BREAKING
నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్

రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి : రావులపాలెం మండల రేషన్‌ డీలర్ల సంఘం డిమాండ్‌

Select Suryaa Now
రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి : రావులపాలెం మండల రేషన్‌ డీలర్ల సంఘం డిమాండ్‌

రావులపాలెం  మేజర్ న్యూస్: రేషన్‌ సరుకుల పంపిణీలో డీలర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని, క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని రద్దు చేయాలని రావులపాలెం మండల రేషన్‌ డీలర్ల సంఘం డిమాండ్‌ చేసింది. రేషన్‌ డీలర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించడంతోపాటు, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు క్వింటాకు రూ.3 కమిషన్‌ పెంచాలని కోరింది.
ఈ మేరకు రావులపాలెం మండల రేషన్‌ డీలర్ల సంఘం అధ్యక్షుడు మట్ట బాబ్జి ఆధ్వర్యంలో డీలర్లు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రావులపాలెం డిప్యూటీ తహసీల్దార్‌ శ్రీనివాస్‌కు అందజేశారు.
ప్రస్తుత క్యూఆర్‌ కోడ్‌ విధానం వల్ల రేషన్‌ సరుకుల పంపిణీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీలర్లు పేర్కొన్నారు. ఈ విధానాన్ని తొలగించి, పంపిణీ ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు. చాలీచాలని కమిషన్‌తో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందించి, కమిషన్‌ పెంపుతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డి ఎస్ ఆర్ మూర్తి కొవ్వూరి సత్తిరెడ్డి బొక్క శ్రీనివాసరావు సూరంపూడి శ్రీనివాసరావు పడాల శ్రీనివాస్ రెడ్డి గంధం శివ నిచ్చెనకోళ్ల  వెంకటేశ్వరరావు మట్టపర్తి శ్రీనివాస్ బెజవాడ గోవిందరావు గుర్రాల వీరన్న తదితరులు పాల్గొన్నారు