కూటమి ప్రభుత్వం అభివృద్ధి చూసే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు..:ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు
అమలాపురం మేజర్ న్యూస్ రెండున్నరేళ్ల కూటమి పాలనలో సమగ్ర అభివృద్ధిని చూసి ప్రజలు వైసీపీను వీడి టీడీపీలోకి చేరుతున్నారని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. అల్లవరం మండలం తూర్పులంక గ్రామంలో మంగళవారం పల్లె పండుగ 3.ఓ కార్యక్రమంలో భాగంగా రూ.98 లక్షలతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే ఆనందరావు శుంఖుస్థాపన చేశారు. ఈసందర్భంగా గ్రామంలోని సుమారు 30 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నేతృత్వంలోని కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అనేక మంది టీడీపీలో చేరుతున్నారని, రాబోయే రోజుల్లో మరింత మంది టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు.
మండల పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర క్షత్రియ కార్పోరేషన్ డైరెక్టర్ దెందుకూరి సత్తిబాబు రాజు మాట్లాడుతూ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతోన్న నేపథ్యంలో ప్రభుత్వ పనితీరు మెచ్చి పార్టీలోకి చేరుతున్నారని, రాబోయే రోజుల్లో వందలాది మంది అల్లవరం మండలంలో టీడీపీలోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇక మీదట ఏ గ్రామం వెళ్లిన అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతోపాటు ఆ గ్రామంలో అభివృద్ధికి ఆకర్షితులవుతున్నారని, పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నవారిని ఆహ్వానిస్తామన్నారు.
గత వైసీపీ పాలనలో విధ్వంసమే జరిగిందని, చివరకు ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారని, మళ్లీ ప్రజల్లోకి ఏవిధంగా వెళ్లాలన్న క్రమంలో పరామర్శల వంకతో మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఎమ్మెల్యే ఆనందరావు లపై నిరాధార ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. రాష్ట్ర శెట్టిబలిజ కార్పోరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమల ఏడుకొండలు, దాట్ల గోపీరాజు, కంకిపాటి గోపీ,ఆకుల లక్ష్మణ్ రావు ముత్యాల బాబి, బొక్కా ప్రసాద్, కంకిపాటి వీరబాబు, వేగిరాజు వెంకట రాజు, కండ్రేగుల సత్యనారాయణతోట నర్సింహారావు కైలా శోభనబాబు కొల్లువిస్ట్నుమూర్తి సాంబ తదితరులు పాల్గొన్నారు.