♋ కర్కాటక రాశి (Cancer) Karkataka Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | కర్కాటక రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani
కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)
ప్రారంభంలో స్థిరాస్తులు, గృహ, విద్య విషయాలు, తల్లి తరపు బంధు మిత్రుల కలయిక నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ. వాహన లాభం. స్త్రీల సహకారం. షాపింగ్లు. మధ్యలో ప్రశాంతత తక్కువ. ఉద్వేగాలధికం. సంతాన, వృత్తిపరంగా అధిక ఆలోచనలు, మార్పులకై కొత్త అనుకూల నిర్ణయాలు ఆత్మీయ వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు, మీ ఆలోచనలు, వారి ఆలోచనలతో సమన్వయము కొరకు అధిక శ్రమ, హృదయాందోళనకు తావివ్వరాదు. వారాంతం రొటీన్లో వ్యక్తిగత, ఆరోగ్య అంశాలలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. ఆలస్యమైన రుణ, వృత్తిపరమైన విషయాలలో ఒత్తిడితో పనులు సాధిస్తారు. సంతాన ఆరోగ్య, అభివృద్ధికి ఖర్చులు. ప్రత్యర్థుల మీద విజయం. హనుమాన్ చాలీసా మేలు.