BREAKING
నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాలి..:జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాలి..:జిల్లా కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్

అమలాపురం, మేజర్ న్యూస్ :స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు, డేటా పరిశీలన, ఎన్నికల ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్,  ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ సీఎండిఎ అధికారి సంపత్, ఎంఎ మరియు ఎండి అధికారి సురేష్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ, మున్సిపల్ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ఎన్నికల సన్నద్ధత చర్యలు చేపట్టాలని సూచించారు.

రిజర్వేషన్ల ఖరారులో నిబంధనలే ప్రామాణికం :పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో వార్డులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీపీ తదితర స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపులో ఎలాంటి పొరపాట్లకు, విచక్షణాధికారాలకు తావులేకుండా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు 2011 జనాభా లెక్కలను, బీసీ రిజర్వేషన్లకు సంబంధిత ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశించిన గణాంకాలను ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ల ఖరారులో రాష్ట్ర ఎన్నికల సంఘం పోర్టల్‌లో నమోదైన నిర్ధారిత ఓటర్ల జాబితా సమాచారాన్ని మాత్రమే ప్రామాణికంగా పరిగణించాలని ఆదేశించారు.
ఎస్టీ రిజర్వేషన్ల ప్రాధాన్యతను నిర్ణయించేటప్పుడు ఆయా గ్రామ పంచాయతీల మొత్తం జనాభాలో ఎస్టీ జనాభా శాతాన్ని సంబంధిత నిబంధనల ప్రకారం పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.

కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలి :రిజర్వేషన్ల తయారీలో స్థానిక ఒత్తిళ్లు, సిఫార్సులకు తావులేకుండా నిబంధనల ప్రకారమే వ్యవహరించాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ముసాయిదాను కింది స్థాయి అధికారులు సిద్ధం చేసిన తర్వాత జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ స్థాయిలో పలుమార్లు క్షుణ్ణంగా పరిశీలించి ధ్రువీకరించాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా లో ఎస్ టి, ఎస్ సి, బి సి రిజర్వేషన్లకు సంబంధించిన గణాంకాలను పకడ్బందీగా పరిశీలించాలని సూచించారు. కలెక్టరేట్ ఎన్నికల విభాగం, ముఖ్య ప్రణాళిక అధికారి సీపీఓ, సహాయ గణాంక అధికారులు ఏఎస్‌ఓలు జాయింట్ కలెక్టర్ బృందాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలు, గ్రామీణ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించిన డేటాను విభాగాల వారీగా పరిశీలించి ఎలాంటి తేడాలు  లేకుండాధ్రువీకరించాలన్నారు.

మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను సాయంత్రం 4 గంటల్లోగా పూర్తి చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలు, డీఎల్‌పీవోలు, ఏఎస్‌ఓలు మండలాల వారీగా పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్, సంబంధిత శాఖాధిపతులు రెండో దశ పరిశీలన చేపట్టి రాత్రి 7 గంటల్లోగా ప్రక్రియను ఖరారు చేయాలని సూచించారు.గెజిట్ ప్రచురణకు నిర్ణీత గడువు
వార్డులు, స్థానాల వారీగా రిజర్వేషన్ల కసరత్తును నిర్ణీత గడువులోగా పూర్తి చేసి జిల్లా గెజిట్‌లో ప్రచురించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గెజిట్ కాపీలను క్రోడీకరించి రాత్రి 9 గంటల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించాలని సూచించారు. ఎన్నికల సంసిద్ధత నివేదికను కూడా నిర్దేశిత సమయంలోగా అందజేసేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే మండలాల వారీగా అవసరమైన ఎన్నికల సిబ్బంది వివరాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఎఫ్‌ఎస్‌టీ స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు (ఎస్‌ఎస్‌టీ) తదితర ఎన్నికల బృందాల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను సాయంత్రం 7 గంటల్లోగా సిద్ధం చేయాలని ఆదేశించారు.ఎన్నికల సామగ్రి, భద్రతా ఏర్పాట్లు సిద్ధంఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పింక్, వైట్ బ్యాలెట్ పేపర్లు, చెరిగిపోని సిరా, గ్రీన్ పేపర్ సీల్స్, సంబంధిత ఫారాలు తదితర సామగ్రి లభ్యతను పరిశీలించాలని ఉన్నతాధికారులు సూచించారు. అదనపు బ్యాలెట్ బాక్సులు అవసరమైతే వెంటనే ఇండెంట్ సమర్పించాలని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక వసతుల కల్పన, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు, పోలీసు శాఖతో సమన్వయ సమావేశాలు నిర్వహించడం వంటి అంశాలను సమాంతరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, రవాణా, సిబ్బంది శిక్షణ, ప్రయాణ మరియు ఇతర భత్యాల ఏర్పాట్లపై మైక్రో ప్లానింగ్ సిద్ధం చేయాలని సూచించారు.ఎన్నికల విధులకు కేటాయించిన ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర సిబ్బందిని అనవసరంగా ఇతర శాఖల పనులకు మళ్లించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని, దాని అమలుకు అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ స్పష్టం చేశారు. రిజర్వేషన్ల ఖరారు నుంచి ఎన్నికల నిర్వహణ వరకు ప్రతి దశలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి, జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు, అమలాపురం కొత్తపేట ఆర్డీవోలు కే సరళ దేవి జి వి విసత్యనారాయణ,  జిల్లా పంచాయతీ అధికారిని శాంతి కుమారి, అమలాపురం మమ్మిడివరం రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్లు ఎం నిర్మల్ కుమార్ రామరాజు ఆర్ఆర్ రాజు, ఎన్నికలు విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు