BREAKING
రైతులపై కేసులు నమోదు ఖండిస్తున్నాం: బి ఆర్ ఎస్ లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు.....

అశ్వారావుపేటలో నూతన షటిల్ కోర్టు ప్రారంభం

Select Suryaa Now
అశ్వారావుపేటలో నూతన షటిల్ కోర్టు ప్రారంభం

అశ్వారావుపేటలో నూతన షటిల్ కోర్టు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని గుర్రాల చెరువు రోడ్డులో డాక్టర్ బాబురావు స్థలంలో నూతనంగా నిర్మించిన సెటిల్ కోర్టును అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ,సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్టా రాగమయి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన షటిల్ కోర్టును ప్రారంభించిన అనంతరం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యేలు అభినందించారు. యువత క్రీడల వైపు మరింతగా ఆకర్షితులు కావడానికి, శారీరక దారుఢ్యంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడానికి ఇటువంటి క్రీడా వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వారు పేర్కొన్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా మౌలిక వసతులను పెంపొందించాల్సిన అవసరం ఉందని, యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి క్రీడలు మంచి వేదికగా నిలుస్తాయని వారు అన్నారు. చదువుతో పాటు క్రీడలకు కూడా యువత ప్రాధాన్యత ఇవ్వాలనిసూచించారు.అశ్వారావుపేట నియోజకవర్గంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో వివిధ క్రీడా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని, యువతకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.షటిల్ కోర్టు నిర్మాణానికి స్థలం సమకూర్చిన డాక్టర్ బాబురావుని ఈ సందర్భంగా అభినందించారు. స్థానికంగా క్రీడలను ప్రోత్సహించేందుకు వ్యక్తిగతంగా ముందుకు వచ్చి వేదికను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో మట్టా దయానంద్,అశ్వారావుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, డాక్టర్ బాబురావు,స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువత తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి మునీర్ అశ్వారావుపేట