BREAKING
మద్యం మత్తులో డ్రైవింగ్.. రూ.3 వేల జరిమానా,ఒకరోజు కమ్యూనిటీ సర్వీస్ అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ అందించాలి - కలెక్టర్ రాజర్షి షా రైతుల కోసమే పొలం పిలుస్తోంది కార్యక్రమాలు రిటైల్ దిగ్గజం టార్గెట్ జోరు టీఎన్జీవోలో 60 మంది ఉద్యోగుల సభ్యత్వ నమోదు నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించాలి : ఏడిఏ మోహనరావు 12వ డివిజన్‌లో పారిశుధ్య సిబ్బందిని పెంచాలని అధికారులకు కార్పొరేటర్ కస్తూరి నాగరాజు విజ్ఞప్తి విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలి - మంత్రి గడ్డం వివేకానంద ఇటలీలో పిల్లలకు సోషల్ మీడియాపై కఠిన ఆంక్షలు 10+2 విధానానికి స్వాగతం - డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు గాజా యుద్ధాన్ని ఆపడంలో ఇజ్రాయెల్, హమాస్‌ల వైఫల్యంపై తీవ్ర విమర్శలు వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి - అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి: కిమిడి (తెలుగు, తమిళ, కన్నడల్లో సుస్వరాలు సృష్టించిన వాగ్గేయకారుని జీవిత చరిత్ర ఇది ) ఇథియోపియా, ఎరిట్రియా సరిహద్దులో భారీగా మోహరించిన సైన్యం

(తెలుగు, తమిళ, కన్నడల్లో సుస్వరాలు సృష్టించిన వాగ్గేయకారుని జీవిత చరిత్ర ఇది )

Select Suryaa Now
(తెలుగు, తమిళ, కన్నడల్లో సుస్వరాలు సృష్టించిన వాగ్గేయకారుని జీవిత చరిత్ర ఇది )

2026 నవంబర్ 3న వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో,  ముత్తుస్వామి దీక్షితార్ 250వ జయంతి సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ. 250 స్మారక నాణేన్ని విడుదల చేశారు. భక్తిరస ప్రధాన కీర్తనలతో ప్రసిద్ధి చెందిన త్యాగరాజు, తాళప్రయోగాల్లో తనదైన ముద్ర వేసిన శ్యామశాస్త్రితో పాటు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరిగా విశిష్ట స్థానం పొందిన దీక్షితార్ తన కృతులను ప్రధానంగా సంస్కృతంలోనే రచించారు. అయితే, ఆయన సంగీత వారసత్వాన్ని భద్రంగా భావితరాలకు అందించడంలో తెలుగు భాష పోషించిన పాత్ర చిరస్మరణీయమైనా, అంతగా ప్రాచుర్యానికి నోచుకోలేదు.

ముత్తుస్వామి దీక్షితార్ తమ్ముడు బాలస్వామి దీక్షితార్ మనుమడైన సుబ్బరామ దీక్షితార్ (1839–1906).. 1904లో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న ఎట్టయపురం సంస్థానంలో 'సంగీత సంప్రదాయ ప్రదర్శిని' అనే విశిష్ట సంగీత గ్రంథాన్ని తెలుగులో ప్రచురించారు. రెండు సంపుటాలుగా వెలువడిన ఈ 1770 పుటల బృహద్గ్రంథంలో కర్ణాటక సంగీత శాస్త్రం, 72 రాగాంగ రాగాలు, వాటి జన్యరాగాలు, రాగలక్షణాలు, ఆరోహణ–అవరోహణలు, సంచారాలు, గమకాల ప్రయోగం, తాళాల లక్షణాలను పొందుపరిచారు. వెంకటమఖి, రామస్వామి దీక్షితార్, త్యాగరాజు, శ్యామశాస్త్రి వంటి 77 మంది సంగీతకారులు, వాగ్గేయకారుల జీవిత విశేషాలను అందులో గుదిగుచ్చారు. ఇదే గ్రంథంలో ముత్తుస్వామి దీక్షితార్ రచించిన 229 కృతులను కూడా స్వరసంకేతాలతో అక్షరబద్ధం చేశారు. గమకాల వంటి సూక్ష్మ సంగీత ప్రయోగాలను ప్రత్యేక సంకేతాలతో సూచించడం ఈ గ్రంథం ప్రత్యేకత. కర్ణాటక సంగీత సిద్ధాంతాన్ని, అందులోని సూక్ష్మాతిసూక్ష్మమైన మెళకువలను ఒకేచోట సమగ్రంగా పొందుపరిచిన ఈ గ్రంథం తరువాతి తరాల సంగీతజ్ఞులు, పరిశోధకులకు ప్రామాణిక పరిశోధన గ్రంథంగా నిలిచి సంగీత విజ్ఞానఖనిగా విఖ్యాతమైంది.

ఈ మహత్తర కార్యం సాకారమవ్వడంలో ఏ.ఎం. చిన్నస్వామి ముదలియార్ పాత్ర మరువలేనిది. మద్రాసు సచివాలయంలో సేవలందించిన ఆయన లాటిన్ భాషా పండితుడు, సంగీతాభిమాని. పాశ్చాత్య సంగీతంలోని ఐదు సమాంతర గీతలపై, వాటి మధ్య ఖాళీల్లో స్వరాలను సూచిస్తూ, ఎడమవైపు క్లెఫ్ (????) గుర్తుతో స్వరస్థాయిని నిర్దేశించే స్టాఫ్ నొటేషన్ పద్ధతిని ఆయన ఆకళింపు చేసుకున్నారు. అదే తరహాలో భారతీయ సంగీత కృతులను నమోదు చేసి, పరంపరానుగతంగా వస్తున్న సంగీతరీతులను నిక్షిప్తం చేయాలని ఆయన తహతహలాడారు. అయితే, కొంత ప్రయత్నం తరువాత కర్ణాటక సంగీతంలోని గమకాలు, తాళాల సూక్ష్మతలను ఆ పద్ధతిలో సంపూర్ణంగా నమోదు చేయడం కష్టమని భావించారు. దాంతో, తెలుగు లిపిలోనైనా దీక్షితార్ సంగీత సంప్రదాయాన్ని ప్రామాణిక స్వరసంకేతాలతో భద్రపరచాలని ఎట్టయపురం మహారాజును కోరారు. బహుశా, కన్నడ లిపితో తెలుగుకు ఉన్న శైలీ సారూప్యం ఆయన ఆలోచనకు ప్రేరణ అయి ఉండవచ్చు. తెలుగు భాషలోనూ పాండిత్యం ఉన్న మహారాజు జగద్వీర రామ వెంకటేశ్వర ఎట్టప్ప ఈ ప్రచురణకు రాజాస్థాన ముద్రణాలయాన్ని, ఆర్థిక సహకారాన్ని అందించారు. అలా చిన్నస్వామి ప్రేరణతో, రాజు ప్రాపకంతో సుబ్బరామ దీక్షితార్ వంశపారంపర్యంగా వస్తున్న తమ సంగీత జ్ఞానాన్ని తెలుగులో గ్రంథస్థం చేయడంతో తెలుగు సౌరభం త్రిలింగదేశపు ఎల్లలు దాటింది. శతాబ్దాల క్రితమే శాస్త్రప్రమాణాలకు అనుగుణంగా పరిణతి చెందిన తెలుగు భాషలో ఈ గ్రంథరాజం వెలువడడం, ఆ సాంస్కృతిక సంపదకు వారసులమైన మనందరికీ గర్వకారణం. 1901లో ముదలియార్ మరణించినప్పటికీ, ఆయన ప్రారంభించిన 1904లో ఈ మహాగ్రంథంగా రూపుదిద్దుకుంది.

దీక్షితార్ స్వరకల్పనల్లో నొట్టుస్వరాలు ఒక ప్రత్యేక ప్రక్రియ. సెల్టిక్, బరోక్ సంప్రదాయాలకు చెందిన యూరోపియన్ సంగీత బాణీల ఆధారంగా ఆయన రూపొందించిన ఈ సరళమైన గీతాలు.‌. పాశ్చాత్య సంగీత ధోరణులను కర్ణాటక సంగీతంతో మేళవించే అరుదైన ప్రయత్నానికి తార్కాణాలు.  ఉదాహరణకు, ‘సంతతం పాహిమాం సంగీత శ్యామలే’ గీతం అప్పటి బ్రిటిష్ జాతీయ గీతమైన ‘గాడ్ సేవ్ ది కింగ్’ బాణీని తలపిస్తుంది. 1905లో ప్రచురించిన 'ప్రథమాభ్యాస పుస్తకము' లో సుబ్బరామ దీక్షితార్ 33 నొట్టుస్వర గీతాలను స్వరసంకేతాలతో పొందుపరిచారు.

ఒకవైపు సంస్కృతంలో అజరామరంగా నిలిచిన అపూర్వ సంగీత సృజన, మరోవైపు తెలుగులో ఆ సంగీత సంప్రదాయానికి శాస్త్రీయ లిఖిత రూపం, ఇంకోవైపు పాశ్చాత్య స్వరబాణీలతో ప్రయోగాలు – ఈ విభిన్న కోణాలు ముత్తుస్వామి దీక్షితార్ బహుముఖ ప్రతిభా వైశిష్ట్యాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన జయంతి సందర్భంగా విడుదలైన స్మారక నాణెం ఈ విశిష్ట సంగీత వారసత్వాన్ని చిరస్థాయిగా నిలపాలి.

వ్యాసకర్త :కృష్ణ బాలాజి పల్లపోతు.

(డెప్యూటీ జనరల్ మేనేజర్ (రిటైర్డ్), SBI

సెల్: 99490 98406).