మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
మీన రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani - పూర్తి వివరాలు, తాజా సమాచారం కోసం సూర్య న్యూస్ చూడండి.
మీన రాశి… ప్రారంభంలో జీవిత భాగస్వామి ఆరోగ్య శ్రద్ధ, వ్యాపార విషయాలలో, ముఖ్య నిర్ణయాలలో ఆలస్యాలు ఆటంకాలు. మానసిక ప్రశాంతత తక్కువ. ఆత్మీయులతో చర్చలలో నిదానము ముఖ్యం. వారం మధ్యలో సంతాన వర్గంతో ఆత్మీయ వ్యక్తులతో కుటుంబ ఆర్థిక నిర్ణయాలలో ఉద్వేగాలు, అసంతృప్తి అధిగమించాలి. సంతాన విషయాలలో శ్రద్ధ చూపిస్తారు. వారాంతం ఆలస్యం అవుతూ వస్తున్న ఎదురుచూసిన వృత్తి విషయాలలో కొంత అభివృద్ధి, తగిన గుర్తింపు, గౌరవం, అధిక శ్రమతో నైపుణ్యాలు పెంచుకుంటూ కృషిశీలతతో ముందుకు వెళతారు. న్యాయ, రుణ విషయాలలో దృష్టి సారిస్తారు. ఆరోగ్యం కొంత అనుకూలం. దత్తాత్రేయుని ఆరాధన, ఆలయ సందర్శన మేలు.
గమనిక: ఇవి జనరల్ రాశి ఫలాలు. ఒక వ్యక్తికి ప్రత్యేకంగా కాదు. ఇవి చంద్రరాశి ఆధారిత గోచార ఫలాలు. వ్యక్తి జన్మసమయ, స్థల వివరాలతో ఏర్పడిన జన్మకుండలి లోని దశ-అంతర్దశలతో కలిపి చూస్తేనే సరియైన అవగాహన వస్తుంది. గోచార గ్రహఫలాలు తక్కువగా ఉన్నా దశలు శుభంగా ఉంటే ప్రభావం స్వల్పమే. చిన్న పరిహారాలతో శుభ ఫలితాలు పొందవచ్చు.