కర్కాటక రాశి వారఫలాలు | 08 NOV 2026 - 14 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
కర్కాటక రాశి…ప్రారంభంలో ఆర్థిక విషయాలలో, కుటుంబ వ్యవహారాలలో మానసిక ప్రశాంతత పెంపొందిం చుకోవాలి. స్థిరాస్తి అంశాలలో ఆగిన అభివృద్ధి, గృహసౌక్యం, తోబుట్టువులతో చర్చలు మిశ్రమ ఫలితాలు. అధిక ఉద్వేగాలని నియంత్రించుకోవాలి. వారం మధ్యలో సంతాన రీత్యా, వృత్తి పరమైన అంశాలలో ప్రణాళికలలో ఏర్పడుతున్న అవరోధాల్ని, అనవసర ఆందోళనలను, ఆలోచనలను సరిచూసుకుంటూ మీ వ్యక్తిగత ఆరోగ్యం, ఆత్మస్థైర్యం మీద తగిన శ్రద్ధ వహించాలి. వారాంతం శ్రమతో అనుకున్న పనులని సామర్థ్యంతో పూర్తి చేసే ప్రయత్నాలు చేస్తారు, మాటలలో, ఆర్థిక విషయాలలో వేగాన్ని గమనించుకుంటూ ముందుకు వెళ్లాలి. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం అనుకూలం. గణపతి ఆరాధన మేలు చేస్తుంది.