ధనుస్సు రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Sagittarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani
ధను రాశి… ఆరంభంలో ముఖ్య పనులలో ఆకస్మిక మార్పులు, సంతానరీత్యా, పెట్టుబడుల కొరకు, స్థిరాస్తి వ్యవహారాల ఆలోచనలు, నిర్ణయాలలో ఉద్వేగాలధికం. మానసిక ప్రశాంతత తక్కువ. డ్రైవింగ్ లో మరియు వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ ముఖ్యం. ఆహార స్వీకరణలో, మాటలలో ఆత్మీయులతో, నూతన అంశాలలో, ఒత్తిడి అదిగమించాలి. మధ్యలో తండ్రి ఆరోగ్య శ్రద్ధ, ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, స్థిరాస్తి వ్యవహారాలలో చర్చలు. ఉన్నత విద్య, దూర ప్రయాణాల పై దృష్టి. శ్రమతో వృత్తిలో అధికారుల ప్రోత్సాహంతో, ఉన్నత స్థాయి, పలుకుబడి వ్యక్తుల సహకారంతో పనులు ముందుకు పెడతాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తిపరమైన గౌరవం గుర్తింపు. వారాంతం ప్రయాణాలు, వృత్తిలో కొత్త మార్పులు. బాధ్యతలు. ఆర్థిక వృద్ధి. మిత్రుల కలయిక, కమ్యూనికేషన్ అనుకూలం. స్త్రీలతో అభిప్రాయబేధములకు తావివ్వరాదు. దత్త ఆరాధన మేలు.