national
స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం పోరాటం
న్యూఢిల్లీ:దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల వ్యవస్థను పునరుద్ధరించడమే ధ్యేయంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తన పోరాటాన్ని కొనసాగిస్తుందని పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు. ప్రస్తుత ముఖ్య ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ హయాంలో కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు పూర్తిగా దెబ్బతిందని, పారదర్శకత లోపించి ఎన్నికలు సరిగ్గా జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడేందుకు రాజీలేని ఉద్యమం చేపడతామని తెలిపిన దిప్కే, రాబోయే రోజుల్లో కేరళలోని యువత, విద్యార్థులు ఈ నిరసనల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తారని ధీమా వ్యక్తం చేశారు.