BREAKING
నాలుగు అడుగుల ముసలి కలకలం..! ఎల్‌నినోపై విద్యార్థుల ర్యాలీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లోకేష్ ఘనస్వాగతం అందుబాటు ధరల్లో క్యాన్సర్ మందులు: రోగుల ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యం – శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా *నారాయణ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్ లో ఘనంగా బాలోత్సవ వేడుకలు..* APRS సంతనూతలపాడు పాఠశాలకు ప్రశంశాపత్రం విట్లంపల్లి తాగునీటికి శాశ్వత పరిష్కారం.. లక్ష డిజిటల్ ఎంఎస్ఎంఈల తయారీకి 50 కేంద్రాలు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రూఫ్‌టాప్ సోలార్‌లో ఏపీ దేశానికే ఆదర్శం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపికి తుఫాన్ ముప్పు! స్వర్ణ,డా. ప్రవీణ్ కుమార్ వివాహ రెసెప్షన్ కు హాజరైన పారిశ్రామిక వేత్త శిద్దా సుధీర్ కుమార్ సిరివెళ్ల నీటి కుంటలో తగ్గుతున్ననీటిమట్టం_ ---ఆందోళనలో గ్రామస్తులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి:ప్రకాశం జిల్లా పోలీసులు మంత్రి లోకేష్ సమక్షంలో రెండో రోజూ పెట్టుబడుల వరద రూ.1,05,634 కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు వైసీపీకి మరో భారీ షాక్.. టీడీపీలోకి పిట్టకాయగుళ్ల మాజీ సర్పంచ్

మణిపూర్‌లో మిలిటెంట్ల కాల్పుల కలకలం.. నలుగురు మృతి

Select Suryaa Now
మణిపూర్‌లో మిలిటెంట్ల కాల్పుల కలకలం.. నలుగురు మృతి

ఇంఫాల్: మణిపూర్‌లో మరోసారి మిలిటెంట్ల కాల్పులు కలకలం సృష్టించాయి. ఉఖ్రుల్ జిల్లాలోని టీఎం కసోమ్ ప్రాంతంలో ఇంఫాల్-ఉఖ్రుల్ ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న రెండు వాహనాలను లక్ష్యంగా చేసుకుని అనుమానిత మిలిటెంట్లు మెరుపు దాడికి పాల్పడ్డారు. సాయుధులైన దుండగులు ఒక్కసారిగా వాహనాలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ దారుణ ఘటనతో ఇంఫాల్-ఉఖ్రుల్ రహదారిపై తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా బలగాలు, స్థానిక పోలీసులు భారీగా ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడికి పాల్పడి సమీప అటవీ ప్రాంతాల్లోకి పారిపోయిన మిలిటెంట్లను పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.