BREAKING
బ్యారెల్ 95 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్ ఆయిల్: ధరల పెరుగుదలకు కారణాలు, తదుపరి అంచనాలు మైక్రోసాఫ్ట్ ఔటేజ్: ఔట్‌లుక్, మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. ప్రభావితమైన సేవల జాబితా లెమన్ ట్రీ హోటల్స్: క్యూ2 ఫలితాలతో 37% అప్‌సైడ్ అంచనా వేసిన ఐడీబీఐ క్యాపిటల్.. టార్గెట్ ప్రైస్ వివరాలు ప్రముఖ నటి మౌషుమి ఛటర్జీ ఇంట విషాదం.. నిర్మాత జయంత్ ముఖర్జీ కన్నుమూత సిపిఎం నేతలను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ గౌడ్ మొబైల్ టారిఫ్‌ల పెంపును సమర్థించిన సునీల్ మిట్టల్: రోజుకు రూ. 10-12 ఖర్చు చాలా తక్కువని వ్యాఖ్య కార్తీక దీపారాధన భక్తులకు గొట్టిపాటి యూత్ అండ.. గుండ్లకమ్మ మార్గం సుగమం వికారాబాద్‌లో నూతన జిల్లా పరిషత్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాజీ మేయర్ వసీంను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం మేయర్ రమేష్ వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి.. - సీఎస్ సంజయ్ జాజ్జు యూపీ 'బుల్డోజర్ బ్రాండ్'పై సీఎం యోగి ఆసక్తికర వ్యాఖ్యలు: రాష్ట్రంలో తయారీ ప్లాంట్ పెట్టాలని పారిశ్రామిక దిగ్గజానికి ఆహ్వానం నాణ్యమైన ఉద్యోగాలు, ఉత్పాదకత వృద్ధిపై దృష్టి పెట్టాలి: భారత్‌కు ఐఎంఎఫ్ కీలక సూచన డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి భారత్‌తో మ్యాచ్‌లో మ్యాట్ హెన్రీ సంచలన బౌలింగ్.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అంటూ కివీస్ కెప్టెన్ ప్రశంసలు ఎంకే సన్స్ ఫైన్ జ్యువెల్స్‌లో రూ. 26 కోట్ల భారీ పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ మనుజా గౌతమ్ ష్రాఫ్

దూసుకొస్తున్న 'అక్వాన్ఏ..పీకి మరో తుఫాన్ ముప్పు.. '!

Select Suryaa Now
దూసుకొస్తున్న 'అక్వాన్ఏ..పీకి మరో తుఫాన్ ముప్పు.. '!

విశాఖపట్నం: వరుస తుఫాన్లతో ఇప్పటికే అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారి, ఈ నెల 16వ తేదీ సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా రూపొందే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ మూర్తి వెల్లడించారు. ఒకవేళ ఈ వాయుగుండం తుఫాన్‌గా బలపడితే దీనికి ఇరాన్ సూచించిన 'అక్వాన్'  అనే పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ తుఫాన్ గమనంపై వాతావరణ శాఖ కీలక వివరాలను వెల్లడిస్తూ.. ఇది ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ నెల 19వ తేదీ సాయంత్రం సమయంలో ఉత్తర కోస్తా ప్రాంతంలో ఇది తీరం దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయని డైరెక్టర్ మూర్తి పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ప్రభావంతో ఈ నెల 15వ తేదీ నుంచే తీర ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత క్రమంగా పెరగనుందని, గంటకు 45 నుండి 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించారు.

ఇటీవల సంభవించిన 'అర్నాబ్', 'మురసు' తుఫాన్ల విధ్వంసం నుంచి కోలుకోకముందే ఈ సీజన్‌లో మూడో తుఫాన్ ముంచుకురావడం పట్ల తీర ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి చేరుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.