BREAKING
ఆకాశాన్ని అంటుతున్న తున్న నిత్యవసర లు ధరలు అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ* *అందమైనబతుకమ్మలతోపోటీపడినమహిళలు* *సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె --25వరోజు రిలే దీక్షలు

నాణ్య‌మైన విద్య‌ను, పౌష్టికాహారాన్ని అందించే బాధ్య‌త నాది సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
నాణ్య‌మైన విద్య‌ను, పౌష్టికాహారాన్ని అందించే బాధ్య‌త నాది  సీఎం రేవంత్ రెడ్డి

పూలే ఆశయాలు కొనసాగిస్తాం

బీసీ జ‌న‌గ‌ణ‌న చేయ‌డానికి దేశంలో ఎవ‌రూ ధైర్యం చేయ‌లేదు..  

బ్రిటిష్ వాళ్ల త‌ర్వాత ఎవ‌రూ  బీసీ జ‌న‌గ‌ణ‌న‌న చేయ‌లేదు..  

కాని మేం బీసీ జ‌న‌గ‌ణ‌న‌న చేసి బీసీల లెక్క తేల్చాం..

యేడాదిలో బీసీ జ‌న‌గ‌ణ‌న ను పూర్తి చేశాం.

పార‌ద‌ర్శ‌కంగా ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ఇస్తాం.

నాణ్య‌మైన విద్య‌ను అందించే బాధ్య‌త నాది..  

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: 150 ఏళ్ల క్రితం మహాత్మ జ్యోతిబాపూలే అణగారిన వర్గాల కోసం కృషి చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మ‌హాత్మ జ్యోతి బా పూలే  
డాక్ట‌ర్ బాబా సాహేబ్ అంబేద్క‌ర్ , మ‌హాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ విగ్ర‌హాల‌ను దేశంలో ఎక్క‌డ‌కిపోయినా చూస్తుంటాం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  
శుక్రవారం హైదరాబాద్ నగరంలో మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వైపు అంబేద్క‌ర్  , మ‌రో వైపు ఇందిరా గాంధీ, మ‌రో వైపు పీవీ న‌ర‌సింహారావు, మ‌రో వైపు జ్యోతి బాఫూలే విగ్ర‌హాల‌ను ఇక్క‌డ ఆవిష్క‌రించుకున్నాం అని అన్నారు..  
వారి స్పూర్తితో విద్య‌లో రాణించాలి, 
న‌క్లెస్ రోడ్డు చౌర‌స్తా ఇప్పుడు అద్భుత‌మైన చౌర‌స్తా గా మారిందన్నారు. 
రాజ్యాంగాన్ని, ఓటు హ‌క్కు ఇచ్చిన డాక్ట‌ర్ బాబా సాహెబ్ అంబేద్క‌ర్ విగ్ర‌హం ఇక్క‌డ ఆవిష్క‌రించ‌బ‌డింది.150 యేళ్ల క్రితం జ్యోతి బా ఫూలే  చ‌దువు ఒక్క‌టే మార్గ‌మ‌ని  త‌ను చదువుకోవ‌డమే కాకుండా త‌న స‌తీమ‌ణిని చ‌దివించ‌డం ద్వారా ఆద‌ర్శంగా నిల‌బ‌డ్డారు అని గుర్తు చేశారు. మా ప్ర‌భుత్వంలో జ్య‌తి బా ఫూలే ఆలోచ‌న‌ల‌ను కొన‌సాగిస్తున్నాం..  
చ‌ద‌వులు ఒక్క‌టే ఆత్మ‌గౌర‌వాన్ని, గుర్తింపును ఇస్తుంది. త‌లెత్తుకునేలా చేస్తుందన్నారు.కుల నిర్మూల‌న జ‌ర‌గాలంటే, సామాజిక చైత‌న్యం కావాలంటే అంద‌రు క‌లిసి క‌ట్టుగా చ‌దువుకోవ‌డం, జీవించ‌డం ద్వారా సాధ్యం అవుతుందన్నారు.  
అందుకే ఇంటిగ్రేటేడ్ రెసిడ్ఎష య‌ల్ స్కూల్స్ తీసుకు వస్తున్నట్లు తెలిపారు. విద్యా  వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా ప్ర‌క్షాళ‌న చేస్తున్నాం. న‌ర్సీరీ నుంచి బ్రేక్ ఫాస్ట్ తో పాటు అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తున్నాం అని అన్నారు. ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి 2400 కోట్ల రూపాయ‌ల‌ ఫీజు రీయింబ‌ర్స్ ను అడ్బాన్స్ గా బ్యాంక్ ఖాతాల్లో వేస్తున్నాం. పార‌ద‌ర్శ‌కంగా ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ఇస్తాం అని హామీ ఇచ్చారు. ప్ర‌తియేడాది 2300 వేల కోట్ల రూపాయ‌ల‌ను విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ వేస్తాం అని అన్నారు. 250 కోట్లు అడ్వాన్స్ గా పెట్టాం. ఆన్ లైన్ లో అప్లై చేసుకుంటే నెల‌లో ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ విద్యార్థుల  ఖాతాల్లో పడుతుంది. ఫీజులు క‌ట్ట‌లేద‌ని సర్టిఫికెట్లు ఇవ్వ‌మ‌ని ఏ కాలేజీ చెప్ప‌కుండా ముందుగానే ఫీజులు చెల్లిస్తామన్నారు. 
ఇంజ‌నీరింగ్ స‌ర్టిఫికెట్ , డాక్ట‌ర్ సర్టిఫికెట్ లో ఉంటే.ఇప్పుడు స‌ర్టిఫికెట్ ఉంటే స‌రిపోదు. న‌ర్స‌రీ నుంచి 12 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు విద్యార్థుల‌కు విద్య తో పాటు స్కిల్స్ నేర్పిస్తున్నాం అని అన్నారు.