BREAKING
ఓటమితో అధైర్య పడవద్దు.. కార్యకర్తలకు అండగా ఉంటా. తలారి రంగయ్య. హొళగుంద సర్పంచ్ గా ఎరుకుల తిప్పేస్వామి ఘనవిజయం కంబదూర్ లో కూటమి విజయకేతనం కళ్యాణదుర్గం మండలంలో టిడిపి విజయకేతం. కేజిబివి పి ఈ టీ విధుల నుంచి తొలగింపు.... ముదిగుబ్బ టిడిపి కైవసం నేడు గణాధిప సంకష్ట చతుర్థి.. శుభ ముహూర్తం..పూజా విధానం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో చంద్రోదయ సమయాలు ఇవే! ఓట్లు లెక్కింపు పరిశీలించిన అధికారులు పూతలపట్టులో మురళి ప్రచారానికి ప్రజాదరణ - వెంట నిలిచిన మండల నాయకులు, గ్రామస్తులు ​ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి అభ్యర్థన ​ప్రతి గడపకూ వెళ్లి ఓటర్ల ఆశీస్సులు కోరుతున్న మురళి ​మౌలిక వసతుల కల్పన, పారదర్శక పాలనే తన ధ్యేయమని స్పష్టీకరణ బాడంగి మండలంలో టీడీపీ హవా25 పంచాయతీలకు ఎన్నికలు.. 18 చోట్ల టీడీపీ, 6 చోట్ల వైకాపా విజయం అనంత రూరల్ సర్పంచ్ ఎన్నికల్లో కూటమికి షాక్, మెజార్టీ సర్పంచ్ స్థానాలు వైసిపి మద్దతుదారులు గెలుపు రేణిగుంట మండలంలో చక్రం తిప్పిన డాలర్స్ దివాకర్ రెడ్డి హోర్ముజ్ జలసంధిలో రెండు చమురు నౌకలు గనులను ఢీకొన్నాయన్న ఇరాన్ ప్రకటన.. మెటా స్మార్ట్ కళ్లద్దాల విక్రయాల నిలిపివేతకు డచ్ సంఘాల న్యాయపోరాటం: బ్రెజిల్ దిగ్గజ సంస్థ 'కాసన్' కీలక నిర్ణయం..

దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం.. అరుదైన గౌరవం!

Select Suryaa Now
దిగ్గజ నటుడు అనంత్ నాగ్‌కు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం.. అరుదైన గౌరవం!

ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించనుంది. 2024 సంవత్సరానికి గాను ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు.

భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ నటుడు అనంత్ నాగ్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, తాజాగా 2024 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది. దశాబ్దాలుగా నటనారంగంలో కొనసాగుతూ ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించిన ఆయనకు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ సర్కిల్స్‌లో హర్షం వ్యక్తమవుతోంది.

వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసిన అనంత్ నాగ్ కేవలం కన్నడ చిత్రాలకే పరిమితం కాలేదు. తెలుగు, హిందీ, తమిళం, మరాళీ, మలయాళం మరియు ఇంగ్లీష్ భాషల్లో మొత్తం 300కు పైగా చిత్రాల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితులే. 'ప్రేమ లేఖలు' (1977), 'భీష్మ', సంచలనం సృష్టించిన 'కేజీఎఫ్' చిత్రాలతో పాటు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'రాత్రి' వంటి పలు చిత్రాల్లో నటించి తెలుగులోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.

చలనచిత్ర రంగంలో ఆయన చేసిన సేవలకు సంబంధించి గతంలోనూ పలు పురస్కారాలు వరించాయి. గమనర్హం ఏంటంటే, ఇటీవల 2025 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌తో సత్కరించింది. ఇప్పుడు తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించడంతో ఆయన కెరీర్‌లో మరో అపూర్వ మైలురాయి చేరినట్లయింది. ఈ పురస్కార ప్రకటన పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.