BREAKING
కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి సర్వే నంబర్ 483 భూములపై రీ -సర్వే... ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారితో బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారి ప్రత్యేక భేటీ ఎస్‌ఐఆర్‌తో అర్హుల ఓట్లను తొలగించొద్దు.. పారదర్శకంగా జాబితా సవరణ చేయాలి:డిసిసి అధ్యక్షుడు ధారాసింగ్‌ నాయక్‌ ఆచార్య డిగ్రీ కళాశాలలో షీ టీమ్స్ అవగాహన సదస్సు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత! అంబులెన్స్‌లోనే ప్రసవం.. మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ తల్లి బిడ్డ క్షేమం అంగన్వాడీ సేవలు బహుళ ప్రయోజనకరం శంకరపల్లి మున్సిపాలిటీలో... అభివృద్ధి పనులకు శ్రీకారం రోడ్డు కోసం ఎమ్మెల్యే పద్మావతికి వినతి పత్రం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన ట్రాక్టర్ విద్యారంగంలో అన్నమయ్యను ముందంజలో నిలపాలి స్మశానం దారి ఆక్రమిస్తున్నా, ప్రభుత్వ భూమి ఆక్రమిస్తున్నా పట్టించుకోని అధికారులు స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలి -- అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇద్దరికి రూ.10 వేల చొప్పున జరిమానా..

‘జైలర్ 2’ తెలుగు రైట్స్‌ కోసం నాగవంశీ పోటీ.. భారీ రేటు ఆఫర్!

Select Suryaa Now
‘జైలర్ 2’ తెలుగు రైట్స్‌ కోసం నాగవంశీ పోటీ.. భారీ రేటు ఆఫర్!


సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ (Jailer 2) కోసం ఇండస్ట్రీలో ఇప్పుడే భారీ పోటీ మొదలైంది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ చిత్రానికి సంబంధించి తెలుగు థియేట్రికల్ హక్కులను దక్కించుకునేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఎస్. నాగవంశీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వసూళ్లను సాధించడంతో, సీక్వెల్ మీద కూడా అదే స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దూసుకెళ్తున్న నాగవంశీ, ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెలుగు హక్కులను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం మేకర్స్‌కు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఆఫర్ చేసినట్లు సమాచారం. తలైవా రజినీకాంత్ ఇమేజ్ మరియు నెల్సన్ టేకింగ్‌పై నమ్మకంతో నిర్మాతలు కూడా ఈ డీల్‌కు సానుకూలంగా స్పందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.