BREAKING
మిట్స్ వర్సిటీ నూతన వీసీగా ప్రొఫెసర్ సరాజు పి.మొహంతి నియామకం : నాణ్యమైన విద్య,ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన లక్ష్యమని వెల్లడి : శుభాకాంక్షలు తెలిపిన ఛాన్సల్లర్ ఎన్.విజయ్ భాస్కర్ చౌదరి సోమీదేవిపల్లి పంచాయతీలో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవ ఎన్నిక ఖమ్మం నగరంలో పలు వివాహ శుభకార్యాలకు హాజరైన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..* 2025–26లో 378.5 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి రాజ్యాంగంతోనే సమాన అవకాశాలు బ్రెజిల్ ఆర్థిక చర్యలపై లూలాతో ఆర్థిక మంత్రి భేటీ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణం, ఆనందదాయకం: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్* ఇంకొల్లు మండలంలో సర్పంచ్‌లు వీరే మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు జీడీపీ డేటాపై ట్రంప్ సంచలన ఆరోపణలు రష్యా రాయబారితో చర్చల ప్రణాళికపై జర్మనీ ఏఎఫ్‌డీ సహ-అధ్యక్షుడి విమర్శలు ఫ్రాన్స్‌లో పెరుగుతున్న సమస్యలు.. అధ్యక్ష రేసులో పోటెత్తుతున్న అభ్యర్థులు కార్పొరేట్ బాండ్ ఇండెక్స్ ఫ్యూచర్స్‌కు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ విద్యుదీకరణ లక్ష్యంపై దేశాలు, సంస్థల సమైక్య ముందడుగు 2025–26లో 253.81 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి మంగళగిరిలో మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు బిజీబిజీ : ఎన్నికల సరళిని పరిశీలించిన తెలుగు యువత రథసారధి

గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమనే ఊరిలో - సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల సందడి

Select Suryaa Now
గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ప్రేమనే ఊరిలో - సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల సందడి

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించేందుకు మరో చక్కటి ప్రేమకథా చిత్రం సిద్ధమవుతోంది. చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న చిత్రం ప్రేమనే ఊరిలో. మనోజ్ కుమార్ కథ, కథనం అందించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సోల్ ఫుల్, ఎమోషనల్ మ్యూజికల్ లవ్ స్టోరీని సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఒక కొత్త పాటను లాంచ్ చేయగా, ఈ కార్యక్రమం సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్ వేడుకలో నటి కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ, సినిమా టైటిల్ చాలా ఆకట్టుకునేలా ఉందని, చిత్రబృందం ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమాటోగ్రఫీ మరియు మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని, చిత్రంలో పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు రావాలని, నిర్మాతలకు భారీ లాభాలు రావాలని మనసారా కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. నూతన నిర్మాత చందు శ్రీనివాస్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో ఆర్టిస్ట్‌గా ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు నిర్మాతగా మారుతున్నానని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. జెన్ జీ ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా విశేషంగా కనెక్ట్ అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రముఖ నిర్మాత, నటుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ, గతంలో తాను అందించిన కొన్ని సూపర్‌హిట్ చిత్రాలరీతిలోనే ప్రేమనే ఊరిలో సినిమా కూడా బ్లాక్‌బస్టర్ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. రూపాయి పెడితే ఐదు రూపాయల లాభాలు తెచ్చిపెట్టే అద్భుతమైన సినిమా ఇదని, కన్నడ మరియు తెలుగు భాషలలో ఈ చిత్రం అఖండ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హీరో శ్రీరామ్, నటి తపస్విని, రమిక తదితరులు మాట్లాడుతూ, ఇదొక ఫీల్ గుడ్ లవ్ ఎంటర్‌టైనర్ అని, ప్రేక్షకులు అందరూ సెప్టెంబర్ 25న థియేటర్లలో సినిమాను చూసి తమను ఆదరించాలని కోరారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.