BREAKING
25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం! ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు!

కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం!

Select Suryaa Now
కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఇటీవల ఫ్యామిలీతో కలిసి ఓ కార్యక్రమానికి హాజరుకాగా, ఆమెపై జరిగిన బాడీ షేమింగ్, ట్రోలింగ్ అంశంపై మరో నటి పరిణీతి చోప్రా తీవ్రంగా స్పందించారు. గర్భం దాల్చిన తర్వాత స్త్రీల శరీరంలో వచ్చే మార్పులపై (Postpartum Body) కొందరు వ్యక్తులు నెగెటివ్ కామెంట్స్ చేయడం అత్యంత అజ్ఞానమని ఆమె మండిపడ్డారు.

తమ మొదటి సంతానాన్ని స్వాగతించిన తర్వాత కత్రినా కైఫ్ పబ్లిక్ అప్పీయరెన్స్ ఇవ్వగా, సోషల్ మీడియాలో కొందరు ఆమె రూపురేఖలపై ట్రోల్స్ చేశారు. దీనిపై పరిణీతి చోప్రా పీటీఐ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఘాటుగా బదులిచ్చారు. "మనం జిమ్‌కి వెళ్లి సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటే మెచ్చుకుంటాం, సెలవులకు వెళ్లి టాన్‌తో వస్తే అప్రిషియేట్ చేస్తాం. మరి ఒక కొత్త ప్రాణాన్ని, బిడ్డను ఈ ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు ఆ తల్లుల శరీరాలపై కనిపించే ఆనవాళ్లను ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం? ప్రసనానంతర శరీరంపై కామెంట్లు చేసే వారిని చూస్తే నాకు చాలా అజ్ఞానంగా అనిపిస్తుంది" అని పరిణీతి పేర్కొన్నారు.

తాను కూడా గర్భం దాల్చిన తర్వాత సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నానని, ఇటువంటి నిరర్థకమైన ట్రోల్స్‌కు తాను ఎప్పుడూ ప్రాధాన్యతనివ్వనని ఆమె స్పష్టం చేశారు. తోటి నటి కత్రినా కైఫ్‌కు మద్దతుగా పరిణీతి చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.