BREAKING
ఆస్కార్ రేసులోకి మరాఠీ థ్రిల్లర్ 'గొంధల్'... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ… నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు *ప్రారంభానికి నోచుకోని ఆటోమేటిక్ వే బ్రిడ్జి* చిట్యాల - మేజర్ న్యూస్ బాక్సాఫీస్ వద్ద మమితా బైజు సరికొత్త చరిత్ర... రూ. 300 కోట్ల క్లబ్‌లో 'బెత్లహెం కుటుంబ యూనిట్' దేశంలోకి డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది... త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి టీకా బీసీ జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది.. కేంద్రంపై కల్వకుంట్ల కవిత ధ్వజం భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ బిగ్‌బాస్ హౌస్‌లో రసవత్తరంగా కెప్టెన్సీ పోరు - షాలిని వర్సెస్ వర్షిణి మధ్య మాటల యుద్ధం గణిత శాస్త్రంలో కందుల రజనికి పీహెచ్.డీ. వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల ఘనంగా ఓ నా సిద్ధయ్య సాంగ్ టైటిల్ పోస్టర్ లాంచ్ - ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ అందజేసిన సిద్ధు రెడ్డి నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. దానం నాగేందర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. అనర్హత పిటిషన్లపై విచారణకు ఆదేశం వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

ఘనంగా ఓ నా సిద్ధయ్య సాంగ్ టైటిల్ పోస్టర్ లాంచ్ - ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ అందజేసిన సిద్ధు రెడ్డి

Select Suryaa Now
ఘనంగా ఓ నా సిద్ధయ్య సాంగ్ టైటిల్ పోస్టర్ లాంచ్ - ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ అందజేసిన సిద్ధు రెడ్డి

సూర్య తెలంగాణ డెస్క్: సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు విభిన్న కళాత్మక ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్న సిద్ధు రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రత్యేక గీతం ఓ నా సిద్ధయ్య. ఈ పాటకు సంబంధించిన టైటిల్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ నగరంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆస్కార్ అవార్డ్ గ్రహీత చంద్రబోస్, ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యాం, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నల్గొండ గద్దర్, గీతా భాస్కర్ తదితర ప్రముఖులు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా రామ్ అద్నాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాట పోస్టర్‌ను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుక సందర్భంగా సామాజిక స్పృహ చాటుతూ సిద్ధు రెడ్డి సుమారు 300 మంది ఆటో డ్రైవర్లకు ఉచిత ఇన్సూరెన్స్ పత్రాలను అందజేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. పేదరికంలో ఉన్న వారికి మరియు అత్యవసర సమయాల్లో వైద్య సహాయం కోరిన వారికి తాను ఎప్పుడూ ముందుంటానని ఆయన నిరూపించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అతిధులు సిద్ధు రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియడమే కాకుండా, ఆయన రియల్ లైఫ్ రియల్ హీరో అని ప్రశంసించారు. ఒక మంచి సామాజిక సందేశంతో పాటు కుటుంబ భావోద్వేగాల కలయికగా ఈ పాట రూపుదిద్దుకున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

రామ్ అద్నాన్ రచన మరియు దర్శకత్వంలో వస్తున్న ఈ పాటను కళ్యాణ్ కీస్ సంగీత సారథ్యంలో రామ్ అద్నాన్, శ్రీనిధి ఆలపించారు. ఈ గీతం కేవలం ఒక సాధారణ పాటలా కాకుండా ఒక గొప్ప సినిమా చూసిన అనుభూతిని ఇస్తుందని, భార్యాభర్తల బంధాన్ని, జీవిత పోరాటాన్ని ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్ తెలిపారు. త్వరలోనే ఈ పాట అధికారికంగా విడుదల కానుండగా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.