BREAKING
ప్రజారోగ్యమే ప్రథమ ప్రాధాన్యం.. పారిశుద్ధ్యంలో నిర్లక్ష్యం సహించేది లేదు! 11వ వార్డులో చైర్‌పర్సన్ కుర్రా అవర్ణ క్షేత్రస్థాయి పర్యటన డ్రైనేజీ, చెత్త సమస్యలపై ప్రజలతో ముఖాముఖి.. అధికారులకు కీలక ఆదేశాలు రాజీవ్ యువ వికాసం పథకాన్ని వెంటనే అమలు చేయాలి 145 గుర్తుతెలియని, క్లెయిమ్ చేయని వాహనాలకు బహిరంగ వేలం:జిల్లా ఎస్పి పుస్తకాలకే పరిమితం కాదు.. ప్రత్యక్ష సేవలే పాఠాలు పోలీస్, ఫైర్, పోస్టల్ క్షేత్రస్థాయిలో చిన్నారుల విద్యా పర్యటన ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష వివాహ శుభకార్యంలో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర యూత్ ప్రతినిధి పోలీస్ సిబ్బంది కుటుంబ సంక్షేమానికి కృషి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెం.1ను సందర్శించిన డీఈఓ అయూబ్ హుస్సేన్ పొన్నూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చారిత్రక విజయ కేతనం సాధిస్తుంది…….. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తాండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ పిఎసిఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు కార్యకర్తలకు అండగా ఉంటాం కోర్టు విచారణల రికార్డింగ్, ప్రసారంపై ఏపీ హైకోర్టు నిషేధం ఏపీలో రేపే తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. సర్వం సిద్ధం!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఊహించని ట్విస్ట్.. రూ. 15 లక్షలతో బయటకు వెళ్లిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్

Select Suryaa Now
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఊహించని ట్విస్ట్.. రూ. 15 లక్షలతో బయటకు వెళ్లిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: రసవత్తరంగా సాగుతున్న రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వీకెండ్ ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. హోస్ట్ నాగార్జున హౌస్‌మేట్స్‌ తప్పులను ఎత్తిచూపుతూ క్లాస్ పీకడంతో పాటు ఈ వారాంతంలో ఒక భారీ సర్‌ప్రైజ్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం హౌస్‌లో టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ గేమ్ కొనసాగుతున్న నేపథ్యంలో నాగార్జున కంటెస్టెంట్లకు డబ్బు ఆఫర్ చేసి పెద్ద పరీక్ష పెట్టారు. ఆట ప్రారంభమైన మూడో వారంలోనే ఏకంగా రూ. 15 లక్షల క్యాష్ ప్రైజ్ సూట్‌కేస్ ఆఫర్ చేయడంతో హౌస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

ఈ ఆఫర్‌ను తొలుత ఐదు లక్షలతో ప్రారంభించి ఎవరూ ముందుకు రాకపోవడంతో పది లక్షలకు, ఆ తర్వాత పదిహేను లక్షలకు పెంచారు. ఈ భారీ మొత్తానికి టెంప్ట్ అయిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ మిథిలేశ్ నేను తీసుకుంటానంటూ ముందుకు వచ్చి అందరినీ షాక్‌కు గురిచేశారు. అయితే ఆ డబ్బు మొత్తం ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతుందని నాగార్జున చెప్పడంతో పాటు కంటెస్టెంట్లు అతన్ని ఆపేందుకు ప్రయత్నించాలని చిన్న పరీక్ష పెట్టారు. ఈ క్రమంలో మిథిలేశ్‌కు, మిగతా హౌస్‌మేట్స్‌కు మధ్య చిన్నపాటి వివాదం నడిచింది. రాంప్రసాద్ వంటి కంటెస్టెంట్లు కాస్త ఆగ్రహంగా నువ్వు బిగ్‌బాస్‌కి పనికిరావు వెళ్లిపో అని చెప్పగా, మరికొందరు మాత్రం సూట్‌కేస్ తీసుకుని వెళ్లమని సూచించారు.

ఈ వారం వైల్డ్ కార్డ్ ద్వారా అపూర్వతో కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టిన మిథిలేశ్ చివరికి ఎక్కువ మంది హౌస్‌మేట్స్ అంగీకారంతో రూ. 15 లక్షల సూట్‌కేస్‌ను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేయడంతో ఎపిసోడ్ ముగిసింది. గేమ్ మొదలైన అతి తక్కువ సమయంలోనే ఇలా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ భారీ మొత్తంతో బయటికి వెళ్లడం టెలివిజన్ చరిత్రలో ఆసక్తికర పరిణామంగా నిలిచింది. ఈ అనూహ్య పరిణామం రాబోయే రోజుల్లో మిగతా కంటెస్టెంట్ల ఆట తీరును, హౌస్ డైనామిక్స్‌ను ఎలా మారుస్తుందనేది ఆసక్తికరంగా మారింది