BREAKING
ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు

'రంభ ఊర్వశి మేనక' సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం: హీరో అల్లరి నరేష్

Select Suryaa Now
'రంభ ఊర్వశి మేనక' సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం: హీరో అల్లరి నరేష్

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే హీరో అల్లరి నరేష్ (Allari Naresh) తాజాగా ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన 'రంభ ఊర్వశి మేనక' చిత్రంతో థియేటర్లలోకి వస్తున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో అల్లరి నరేష్ మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ముందుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి నాగార్జునకు వీరాభిమానినని, ఆయనతో కలిసి 'నా సామి రంగా' చిత్రంలో నటించడమే కాకుండా ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో హీరోగా చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. నిర్మాత నిమ్మకాయల ప్రసాద్‌తో తన పరిచయం 'అల్లరి' సినిమా సమయం నుంచే ఉందని, ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ చాలా బాగుంటుందని తెలిపారు.

దర్శకుడు చంద్రమోహన్ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని నరేష్ గుర్తుచేసుకుంటూ.. పరిశ్రమలో అవకాశాలు రాకపోతే ఉండే బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని, తమ కుటుంబంలోనూ అలాంటి రోజులను చూశానని అన్నారు. ఈ సినిమా చంద్రమోహన్‌కు పెద్ద సక్సెస్ కావాలని, దర్శకుడిగా ఆయనకు ఇక్కడి నుంచే విజయాల ప్రయాణం మొదలవ్వాలని కోరుకున్నారు.

ఈ చిత్రంలో పెద్ద నరేష్ ఉండటం వల్ల నవ్వులు రెండింతలు అవుతాయని, రంభ, ఊర్వశి, మేనక పాత్రలు చేసిన నటీమణులు ఎంతో కష్టపడి ఎనర్జిటిక్‌గా నటించారని చెప్పారు. అలాగే సురభి అద్భుతంగా పర్ఫార్మ్ చేసిందని, భవిష్యత్తులో ఆమె మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. ఇది అందరినీ కడుపుబ్బా నవ్వించే అచ్చమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, సెప్టెంబర్ 4న విడుదలవుతున్న ఈ సినిమాతో పక్కా హిట్ కొడుతున్నామని, సెప్టెంబర్ 9న సక్సెస్ మీట్ కూడా పెట్టుకుంటున్నామని ఆయన పూర్తి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.