BREAKING
సెప్టెంబర్ 4 నుంచి ఓటీటీలో మ్యూజికల్ డ్రామా 'జగమే సంగీతం' 7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త సినిమా 'ఇ.ఎం.ఐ' పూజా కార్యక్రమాలతో ప్రారంభం! 278 మంది లబ్ధిదారులకు రూ.1.39 కోట్లు పంపిణీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వచ్చేస్తోంది.. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా షో ప్రారంభం! 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించాలి రవితేజ ‘ఇరుముడి’కి బాక్సాఫీస్ షేక్.. జనరేషనల్ బ్లాక్‌బస్టర్‌గా సెన్సేషన్! సుడిగాలి సుధీర్ ‘GOAT’.. సెప్టెంబర్ 11న థియేటర్లలో యాక్షన్ కామెడీ దుమ్మురేపనున్నాడా? కార్తీ ‘సర్దార్ 2’.. సెప్టెంబర్ 10న థియేటర్లలో స్పై యాక్షన్ ధమాకా! కాంగ్రెస్ పార్టీ హామీల మోసాలపై.. బిఆర్ఎస్ పోరుబాట మ్యాజిక్కా.... మజాకానా పుష్పక విమానాన్ని తలపిస్తున్న టాటా మ్యాజిక్ లు పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 1.11 కిలోల గంజాయి స్వాధీనం.. ఒకరి అరెస్ట్ రోజూ వాకింగ్ చేస్తున్నారా? అయితే ఈ 8 విషయాలు తప్పక తెలుసుకోండి.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్! అశ్వాపురంలో కారులో తరలిస్తున్న 40 కిలోల గంజాయి పట్టివేత: ఒడిశా దంపతుల అరెస్ట్ వైద్య కళాశాల, జీజీహెచ్‌లో మౌలిక వసతులకు ప్రాధాన్యం. మంత్రి దామోదర్ రాజనర్సింహ

7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త సినిమా 'ఇ.ఎం.ఐ' పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

Select Suryaa Now
7 పి.ఎం. ప్రొడక్షన్స్ కొత్త సినిమా 'ఇ.ఎం.ఐ' పూజా కార్యక్రమాలతో ప్రారంభం!

'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' చిత్రంతో ఘన విజయం సాధించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణ రంగంలో దూకుడు పెంచింది. తాజాగా నూతన నటీనటులు మరియు టెక్నీషియన్లతో సరికొత్త సినిమాను ప్రారంభించింది. 'ఇ.ఎం.ఐ' (EMI) అనే ఆసక్తికరమైన టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిఖిల్ కువ్వరపు దర్శకత్వం వహిస్తున్నారు.

వివిధ వెబ్ సిరీస్‌లతో గుర్తింపు తెచ్చుకున్న దరహాస్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతుండగా, 'లిటిల్ హార్ట్స్' ఫేమ్ శైలజ కథానాయకిగా నటిస్తోంది. పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి నటుడు ఆది సాయికుమార్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు సాయి మార్తాండ్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అలాగే దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ స్క్రిప్ట్ అందజేశారు.

మధ్యతరగతి జీవితాల్లో ప్రతీ వస్తువు కొనుగోలుకు ఇ.ఎం.ఐ కష్టాలు ఏ విధంగా ఉంటాయనే పాయింట్‌ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. యూత్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఒకేలా ఆకట్టుకునేలా హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌తో పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇక ఈ సినిమాతో పాటు దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో మరో భారీ ప్రాజెక్ట్‌ను కూడా 7 పి.ఎం. ప్రొడక్షన్స్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో వైవిధ్యమైన కథాంశాలతో వరుస చిత్రాలను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.