BREAKING
నరసింగపురంలో భారీ అగ్ని ప్రమాదం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పారదర్శకత పాటించాలి పిఠాపురం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం పంపా నదీ తీరంలో కార్తీక ఆఖరి సోమవారం ఏర్పాట్లపై ఈవో లక్ష్మీ శివజ్యోతి ప్రత్యేక సమీక్ష బడుగుల జీవితాల్లో అక్షర వెలుగులు నింపిన జ్యోతి అణగారిన వర్గాల, మహిళల హక్కుల కోసం పోరాడిన మార్గదర్శకుడు మహాత్మా జ్యోతిరావ్ ఫులే సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా: 200 మంది సిబ్బందితో పటిష్ట భద్రత మున్సిపల్ చైర్మన్ శేషారావుకు ‘ప్రజామిత్ర’ పురస్కారం భారత ఆర్మీ జవాన్ వేణు కు ఘనంగా నివాళులు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.2 లక్షల విరాళం డిగ్రీ కళాశాల రంపచోడవరం క్యాంపస్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహణ పగడ్బందీగా ఆపరేషన్ త్రిశూల్ కార్యక్రమం కార్తీక మాసం మూడవ శనివారం.. అన్నవరంలో భక్తజన సంద్రం! కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు

యువతకు ఉపాధి అవకాశాలు.. 40 మందికి ఇప్పటికే ఉద్యోగాలు.. : జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

Select Suryaa Now
యువతకు ఉపాధి అవకాశాలు.. 40 మందికి ఇప్పటికే ఉద్యోగాలు..  : జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్

అమలాపురం మేజర్ న్యూస్ డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కౌశలం  కార్యక్రమాన్ని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ డా. ఆర్. మహేష్ కుమార్ రావిరాల  తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కౌశలం కార్యక్రమం ద్వారా యువతకు వారి విద్యార్హతలు, నైపుణ్యాలకు అనుగుణంగా వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉద్యోగ నియామక డ్రైవ్‌లను నిర్వహిస్తోందని, ఈ కార్యక్రమంలో భాగంగా *కౌశలం పోర్టల్‌లో ఇప్పటివరకు మొత్తం 55,145 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని నమోదైన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపడుతున్నారు.

ఇప్పటికే 8.09.2026న డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిర్వహించిన మొదటి ఉద్యోగ నియామక డ్రైవ్‌లో సంస్థ ద్వారా 40 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారికి నియామక ఉత్తర్వులు కూడా అందజేయడం జరిగింది.ఈవిజయవంతమైన కార్యక్రమం ద్వారా జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ఫలితాలు అందుతున్నాయని కలెక్టర్ తెలిపారు.

ఈనెల14.10.2026న డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాల సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామక డ్రైవ్ నిర్వహించబడుతుంది.ఈ నియామక డ్రైవ్‌లో మెషిన్ ఆపరేటర్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఉద్యోగ ప్రదేశం తిరుపతి జిల్లాలోని నాయుడుపేటగా పేర్కొనబడింది.ఎస్ ఎస్ సి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐ టి ఐ తదితర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు సంబంధిత ఉద్యోగానికి నిర్దేశించిన అర్హతలు, ఎంపిక ప్రమాణాలకు అనుగుణంగా పాల్గొనవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి రూ.1,86,000 నుండి రూ.1,98,000 వరకు వేతనం లభించే అవకాశం ఉంది.జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ నియామక డ్రైవ్‌లో పాల్గొని, అందుబాటులో ఉన్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అభ్యర్థుల సమీకరణ, అవసరమైన ఏర్పాట్లు, నియామక ప్రక్రియ పర్యవేక్షణకు సంబంధిత అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సందర్భంగ జిల్లా ఎస్ ఈ జె అధికారి  వి. విజయలక్ష్మి మాట్లాడుతూ, కౌశలం కార్యక్రమం ద్వారా అర్హులైన యువతకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా శాఖ కృషి చేస్తోందని తెలిపారు. కౌశలం పోర్టల్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, అవసరమైన ఇతర పత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.