BREAKING
ప్రతిరోజూ పండ్లు తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీ ముఠా అరెస్ట్ - 29 నేరాలు వెలుగులోకి మాటలు చెప్పను అభివృద్ధి చేసి చూపిస్తా -60వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి ఆదం సుధాకర్ రెడ్డి చేతులు కడుక్కోవడంలో ఈ చిన్న పొరపాట్లు చేస్తున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే! రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం జల సంరక్షణపై విద్యార్థుల బృహత్తర కార్యక్రమం* బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. 30 కోట్ల దిశగా 'ఉడ్తా తీర్' వసూళ్లు! సమస్యలు లేని డివిజన్ గా మారుస్తా.. -63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి హామీ సాగునీరు సాధనకై ఉద్యమించాలి పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడుగా కేశవమూర్తి ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...మండల కార్యదర్శి, సైదులు సిపిఐఎం ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... 54వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి విషాదం.. ఆత్మహత్య చేసుకున్న పారా ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ యాదవ్!

యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి మంత్రి అనిత

Select Suryaa Now
యుద్ధ   ప్రాతిపదికన సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి మంత్రి అనిత

యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి మంత్రి అనిత..               అమలాపురం
మేజర్ న్యూస్ 
ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధ ప్రాతిపదికన సహాయక, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోం వ్యవహారాలు, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావించి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
బుధవారం అమలాపురంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి నిర్వహించిన జూమ్ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్, అమలాపురం పార్లమెంట్ సభ్యుడు గంటి హరీష్ మాధుర్, జిల్లా జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,అమలాపురం శాసనసభ్యుడు అయితాబత్తుల ఆనందరావు, అముడా చైర్మన్ అల్లాడ స్వామినాయుడు తదితరులతో కలిసి మంత్రి జిల్లా అధికారులతో తుఫాన్ ప్రభావం, జరిగిన నష్టం, సహాయక చర్యలు, పునరుద్ధరణ పనుల పురోగతిపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయాన్ని తక్షణమే అందించాలని, విద్యుత్ సరఫరా, తాగునీరు, ఆహార సదుపాయాలను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
శాఖలవారీగా నష్టం అంచనా వేసి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి
తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ, వ్యవసాయం, ఉద్యానవనాలు, రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ, పారిశుధ్య నిర్వహణ తదితర రంగాల్లో జరిగిన నష్టాన్ని సంబంధిత శాఖల అధికారులు తక్షణమే అంచనా వేయాలని మంత్రి సూచించారు. నేలకొరిగిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి రహదారులపై రాకపోకలకు ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
విద్యుత్ సరఫరాకు ఏర్పడిన అంతరాయాలను సరిచేసి సాధ్యమైనంత త్వరగా సరఫరాను పునరుద్ధరించాలని, తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని ఆదేశించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన వ్యవసాయ, ఉద్యాన పంటల వివరాలను సేకరించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ
జిల్లా, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ల ద్వారా 24 గంటల పాటు పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించి అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సహాయక చర్యలు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల అవసరాలను గుర్తించి తక్షణ సహాయం అందించడంతో పాటు, సాధారణ జనజీవనం త్వరితగతిన పునరుద్ధరించేందుకు సమష్టిగా కృషి చేయాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వి. సుబ్బారావు, డిప్యూటీ కలెక్టర్ అచ్యుతకుమారి, జిల్లా పరిపాలన అధికారి కె. నాగలక్ష్మమ్మ, జిల్లా పంచాయతీ అధికారి కె. శాంతికుమారి, అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారి ఎం. మురళీకృష్ణ, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి సి.హెచ్. శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.                       *రంబాల సత్యనారాయణ అమలాపురం *