విద్యుత్ మోటర్ ధ్వంసం.. బాధితులకు అండగా ఉంటాం అన్న ఎమ్మెల్యే
మంత్రాలయం రూరల్, సూర్య ప్రతినిధి
మంత్రాలయం మండల పరిధిలోని మాధవరం గ్రామానికి వైసీపీ కార్యకర్త కురువ పంచముఖ నాగరాజు పోలం ఉన్న మోటర్ ను టీడీపీ వర్గీయులు ధ్వంసం చేసినట్లు భాదితుడు ఆరోపించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారంలో పాల్గోన్నడంతో ఈ చర్య పాల్పడినట్లు తెలిపారు. దీంతో దాదాపు రూ. 3 లక్షల నష్టపోయానని బాధితడు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నిన్న రాత్రి మంత్రాలయం లోని వైకాపా ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటికి వెళ్ళి టీడీపీ శ్రేణులు బెదిరింపులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బాధితుడికి అండగా ఉంటాం ;- కురువ పంచముఖ నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హామీ ఇచ్చారు. శనివారం కురువ నాగరాజు చెందిన పోలంలో టీడీపీ వర్గీయులు తన మోటర్ ధ్వంసం చేసిన విషయం తెలుసుకుని ఫోన్లో పరామర్శించి ధైర్యం ఉండాలని , అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
నాగరాజు సూర్య ప్రతినిధి మంత్రాలయం రూరల్ కర్నూలు జిల్లా