విద్యార్థులు సెల్ ఫోను దూరంగా ఉండాలి
రామభద్రపురం, సూర్య: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని ఎస్ఐ వి.జ్ఞాన ప్రసాద్ సూచించారు. మండల పరిధిలోని బూసాయవలస హైస్కూల్లో గురువారం గుడచ్, బ్యాడ్ టచ్పె విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవ సరమైతే తప్ప విద్యార్థులు సెల్ ఫోన్లు వినియోగించరాదని తెలిపారు. విద్యపైనే దృష్టిసారించి ప్రణాళికాబద్ధంగా చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ప్రాథమిక స్థాయి న సించే లక్ష్యాలను నిర్దేశించుకొని వాటికి అనుగుణంగా కృషి చేయాలన్నారు. అలాగే ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాల పై కూడా అవగాహన పెంచుకోవాలన్నారు. ఇటీవల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి పై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థినిలను ఎవరైనా వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అటువంటి సంఘటనలు జరిగితే విద్యార ులు వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెల్లూరి ప్రసాద్, ఉ పాధ్యాయులు పాల్గొన్నారు.