BREAKING
శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం.. ఎస్పీ రాహుల్ మీనా.. మున్సిపల్ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం కల్పించాలి..:బ్రాహ్మణ పెద్దల సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం.. రైల్వే ట్రాక్ మార్గాన్ని పునఃపరిశీలించండి..:ఎమ్మెల్యే ఆనందరావుకు చాంబర్ ఆఫ్ కామర్స్ వినతి.. ముమ్మిడివరంలో 24వ రోజుకు చేరిన వీఆర్ఏల సమ్మె: స్పందించని ప్రభుత్వం.. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వరంలో జాతీయ బాలిక దినోత్సవ వేడుకలు. దివంగత నేత జక్కంపూడి రామ్మోహనరావు వర్ధంతి 52 మంది లబ్ధిదారులకు హౌసింగ్ లోన్ మంజూరు.... ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు. లయన్స్ ఆధ్వర్యంలో పాత కళ్లజోళ్ల సేకరణ,: జిల్లా గవర్నర్ లయన్ చిట్నీడి శ్రీనివాసు పిలుపు! యువత స్వామి వివేకానందవారిని అదర్శముగా తీసుకోవాలి.. ఎం పి గంటి హరీష్ మాధుర్, ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో ఆదిమూలంవారిపాలెం వాసి వైఎస్సార్‌సీపీ ‘గడప గడపకు’ కార్యక్రమం.. కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ధ్వజం! ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు అంబాజీపేట విద్యార్థులు ఎంపిక: పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే నల్లమిల్లి. పోతవరం పంచాయతీలో వీబీజీ రామ్ అవగాహన ర్యాలీ - పాల్గొన్న శ్రామికులు, తనిఖీ బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కానూరు హైస్కూల్ విద్యార్థులు

విద్యార్థులు నైపుణ్యానికి " మా చిన్నారి నేస్తాలు" దోహదం

Select Suryaa Now
విద్యార్థులు నైపుణ్యానికి " మా చిన్నారి నేస్తాలు"  దోహదం

గుర్ల, సూర్య: పాఠశాల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, వారిలో పఠనాసక్తిని పెంపొందించేందుకు రూపొందించిన ‘మా చిన్నారి నేస్తాలు’ ప్రత్యేక మ్యాగజైన్‌‌ను జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు గురువారం ఘనంగా ఆవిష్కరించారు. గుర్ల మండలం  పల్లిగండ్రేడు గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న  అంకం సురేష్ కుమార్ విద్యార్థుల సమగ్ర వికాసాన్ని కాంక్షిస్తూ ఈ పత్రికను ప్రత్యేక శ్రద్ధతో రూపొందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో  జిల్లా విద్యాశాఖాదీకారి పత్రిక ప్రతిని విడుదల చేసి మాట్లాడారు.విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు ఇలాంటి విజ్ఞానదాయకమైన, సృజనాత్మక అంశాలతో కూడిన పత్రికలు ఎంతో అవసరమని తెలిపారు.విద్యార్థుల కోసం అంకం సురేష్ కుమార్ మాస్టర్ చేస్తున్న కృషి  ఎంతో అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ఉపయోగపడే ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గుర్ల మండల  విద్యాశాఖ అధికారులుఎస్.భాను ప్రకాష్ ,ఎం శ్రీనివాసరావు, యుటి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాసరావు, పెనుబర్తి జిల్లా ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కొండపల్లి శ్రీనివాసరావు, మ్యాగజైన్ రూపకర్త అంకం సురేష్ కుమార్  పాల్గొన్నారు.