BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు -ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Select Suryaa Now
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు -ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్   :   ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. శనివారం ఆయన నగరంలోని నెల్లూరు రూరల్  ఎమ్మెల్యే కార్యాలయంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులతో వివిధ పనులపై సమీక్షించారు.  నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ప్రజల సౌకర్యార్థం ఇటీవల కోట్లాది రూపాయలతో సిమెంట్ రోడ్లు, తారు రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే రోడ్ల నిర్మాణం పూర్తయిన కొద్ది రోజులకే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, గ్యాస్ పైప్‌లైన్ తదితర పనుల పేరుతో కొత్తగా నిర్మించిన రోడ్లను తవ్వడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.  పనులు పూర్తయిన అనంతరం తిరిగి రోడ్లను యథాస్థితికి తీసుకురాకుండా వదిలేయడం పట్ల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై సంబంధిత కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించి, ఇప్పటికే నిర్మించిన రోడ్లను తవ్వే పనులను తక్షణమే నిలిపివేయాలని సూచించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, గ్యాస్ పైప్‌లైన్ తదితర పనులన్నింటినీ ముందస్తు ప్రణాళికతో సమన్వయం చేసుకోవాలని,  ప్రజాధనం వృథా కాకుండా చూడటంతో పాటు, ప్రజలకు పదేపదే ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  అధికారులకు సూచించారు.  ప్రజాధనం వృథా కాకూడదని, ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్నారు. ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఈఈలు శేషగిరి రావు, అనిల్ కుమార్, డీఈ శ్రీకాంత్, ఏఈలు అంకలింగం, వంశీకృష్ణ, చంద్రహాస్, చైతన్య, సురేష్, తదితరులు పాల్గొన్నారు.