వేతనాలు చెల్లించాలి అంటూ వి ఏ ఓల వినతి
కనీస వేతనాలు చెల్లించాలని వెలుగు వీఏఓల వినతి
అవనిగడ్డ, మేజర్ న్యూస్: తమకు కనీస వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతూ ఏపీ వెలుగు వీఏఓల సంఘం ఆధ్వర్యంలో యానిమేటర్లు బుధవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు.
వీఏఓలకు హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ప్రమోషన్ల సౌకర్యం కల్పించాలని కోరారు. రూ.10 లక్షల వడ్డీలేని రుణం, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 60 ఏళ్లు నిండిన వీఏఓలకు నిలుపుదల చేసిన వేతనాలను వెంటనే చెల్లించాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ