BREAKING
గండిగూడెం దుర్గమ్మ, ఎల్లమ్మ, చిత్తరమ్మ దేవాలయాల నిర్మాణాలకు ఎమ్మెల్యే భారీ విరాళం.. బొమ్మన రవీంద్రనాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు మంచం గుర్తుతో ఆశా సుబ్రహ్మణ్యం ప్రచార శంఖారావం చిన్నారుల ఆరోగ్య రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి మైనారిటీలకు అండగా నిలుస్తూ పేద విద్యార్థిని, విద్యార్థులకు ఇంటి పెద్ద కొడుకులా ఆదుకుంటున్న వక్స్ బోర్డ్ డైరెక్టర్...... ఇస్మాయిల్ బేగ్ ఉచిత మెగా వైద్య శిబిరం చేరుకులపాడు సర్పంచ్ అభ్యర్థిగా శకుంతలమ్మ నామినేషన్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి. పల్స్ పోలియో - మన పిల్లల భవిష్యత్తుకు రక్షణ టెలికం బోర్డు మెంబర్ బీజేపీ జిల్లా నాయకులు బైండ్ల కుమార్ పేకాట స్థావరంపై పోలీసుల దాడి నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.. రెండు చుక్కలు జీవితానికి రక్షణ: సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి నిరుపేదలకు ఆరోగ్య భరోసా కల్పించడమే లక్ష్యం లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పల్స్ పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ బొక్క సువర్ణ అంజిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు...గుత్తుల సాయి…

నరసాపురం వాసుల చిరకాల స్వప్నం సాకారం: వశిష్ట వారధి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు, టెండర్ల ప్రక్రియ పూర్తి

Select Suryaa Now
నరసాపురం వాసుల చిరకాల స్వప్నం సాకారం: వశిష్ట వారధి నిర్మాణానికి తొలగిన అడ్డంకులు, టెండర్ల ప్రక్రియ పూర్తి

సూర్య ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల ప్రజల దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నరసాపురం నియోజకవర్గ ప్రజలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల తీర ప్రాంత వాసుల చిరకాల వాంఛ అయిన ప్రతిష్టాత్మక వశిష్ట వారధి నిర్మాణానికి ఉన్న అన్ని సాంకేతిక, పరిపాలనా అడ్డంకులు తొలగిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి పాయ అయిన వశిష్ట నదిపై నిర్మించనున్న ఈ కీలక వారధి నిర్మాణ పనులు కొద్ది నెలల్లోనే పట్టాలెక్కనున్నాయి. ఈ వంతెన నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో తీర ప్రాంత ప్రజలు, రైతులు, వ్యాపార వర్గాల్లో తీవ్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 

గతంలో నరసాపురం మరియు సఖినేటిపల్లి రేవుల మధ్య వారధి నిర్మించాలనే డిమాండ్‌పై చేపట్టిన భూసేకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తి కావడంతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా రాజుల్లంక, కోనసీమ జిల్లా రామేశ్వరంల వద్ద గోదావరి నదిపై భారీ వారధి నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ రూ. 580 కోట్ల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ బిడ్డింగ్‌లో నాలుగు ప్రముఖ నిర్మాణ సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, పరిశీలన అనంతరం టెండర్ల కేటాయింపు తుది దశకు చేరింది. త్వరలోనే నిర్మాణ సంస్థకు పనులు అప్పగించి శంకుస్థాపన చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఈ భారీ ప్రాజెక్టులో భాగంగా నరసాపురం మండలం సీతారాంపురం నుంచి వైఎస్ పాలెం, లక్ష్మణేశ్వరం, రాజుల్లంక మీదుగా గోదావరి దాటి కోనసీమ పరిధిలోని రామేశ్వరం, గుడిమెళ్లలంక వరకు మొత్తం 21 కిలోమీటర్ల మేర 216 బైపాస్ జాతీయ రహదారిని విస్తరించి నిర్మించనున్నారు. ఇప్పటికే ఉభయ జిల్లాల పరిధిలో ఈ జాతీయ రహదారి బైపాస్‌కు అవసరమైన భూసేకరణ ప్రక్రియను రెవెన్యూ యంత్రాంగం పూర్తి చేసి, భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కూడా పంపిణీ చేసింది. గతంలో పలువురు ముఖ్యమంత్రులు ఈ వారధికి శంకుస్థాపనలు చేసినప్పటికీ పనులు ముందుకు సాగక నిలిచిపోయాయి. ఇప్పుడు కేంద్రం నిధులు కేటాయించి టెండర్లు ఖరారు చేయడంతో గోదావరి జిల్లాల మధ్య దూరం గణనీయంగా తగ్గి, వాణిజ్యం, పర్యాటకం కొత్త పుంతలు తొక్కనున్నాయి.