వర్ణ యాగంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
గోదావరి గట్టున ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగం కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. ప్రజల సుఖసంతోషాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ యాగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు స్వాగతం పలికారు.