BREAKING
స్మశానాన్ని ఆక్రమించుకుంటున్నారని ఆర్డీవో, తాహసిల్దార్ ను ఆశ్రయించిన మహిమలూరు గ్రామస్తులు సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో వరుణ మంత్ర జపం కాణిపాకంను సందర్శించిన బిజివేముల వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పణ మన్నెమాల సుకుమార్ రెడ్డిని కలిసిన 14, 15 వార్డుల వీర మహిళలు ఐపీఓ ప్రకటనతో ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడీ వేతనం వెల్లడి రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. ఫేస్‌బుక్ హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు సీఎం హామీలతో ప్రొద్దుటూరు అభివృద్ధికి కొత్త ఊపిరి — ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల బరిలో మారిన మెరీన్ లే పెన్ వ్యూహం బాధిత బాలికకు మెరుగైన వైద్యం, కుటుంబానికి అండగా ప్రభుత్వం కోర్టులో పెప్సికో, మాన్స్టర్ సంస్థలకు ఊరట యువతకు స్ఫూర్తినిచ్చేలా నిలవాలి పరిశోధనల దశ దాటి వాణిజ్య ఉత్పత్తి వైపు అణు కలయిక శక్తి నర్రవాడ పీహెచ్‌సీలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మిక తనిఖీ..! రైతులకు అందుబాటులో యూరియా, డిఎపి ఎరువులు

విద్యా రంగంలో జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

Select Suryaa Now
విద్యా రంగంలో  జిల్లాను ముందంజలో నిలపాలి- జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

 సూర్య ,నంద్యాల బ్యూరో,:జిల్లాలో విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసి, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందించేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ పనితీరు, విద్యా కార్యక్రమాల అమలు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, పదో తరగతి  ఫలితాల మెరుగుదల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు (CWSN) ఎన్‌రోల్‌మెంట్, స్కిల్ డెవలప్మెంట్ తదితర అంశాలపై పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిoచిగా 
జిల్లా నుంచి హాజరైన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. సమీక్ష అనంతరం జిల్లాలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, పాఠశాలల మౌలిక వసతుల కల్పన, నిధుల వ్యయం, విద్యార్థుల ప్రవేశాలు, బడి బయట పిల్లలు, విద్యార్థుల హాజరు, డ్రాపౌట్లపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్షిస్తూ మనబడి, నాడు నేడు, PM SHRI పాఠశాలల నిర్మాణ, మౌలిక వసతుల పనులతో పాటు ఆడిటోరియం నిర్మాణాలను కూడా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

 మంజూరైన నిధులను నిబంధనల ప్రకారం సకాలంలో ఖర్చు చేసి, పనుల పురోగతికి అనుగుణంగా వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. నిధుల వినియోగం సక్రమంగా జరిగితేనే కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి విడత నిధులు సకాలంలో విడుదలయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.  ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో  పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. పనుల వాస్తవ పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, మౌలిక వసతుల స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించి, సమస్యలను అక్కడికక్కడే గుర్తించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో పదవ తరగతి ఫలితాల మెరుగుదలకు మిషన్ మార్చి -2027 పక్కగా అమలు అమలు అయ్యేలా చూడాలన్నారు.  విద్యార్థుల గైర్హాజరు మరియు డ్రాపౌట్లకు గల కారణాలను గుర్తించి వాటిని నివారించేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు. బడి బయట పిల్లలు పాఠశాలలో   చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
 

విద్యాశాఖకు సంబంధించిన ప్రాధాన్యతా కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసేందుకు వివిధ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలన్నారు.   విద్యాశాఖకు సంబంధించిన అన్ని విభాగాల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. లక్ష్యానికి అనుగుణంగా స్కిల్ హబ్ లో శిక్షణ కార్యక్రమాలు  నిరంతరం జరుగుతూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, వయోజన విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, సమగ్ర శిక్ష అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి, ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ సోమ శివారెడ్డి, ఆర్ ఏ ఓ శంకర్ నాయక్, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శశికళ పాల్గొన్నారు.

మధు బాబు, 'సూర్య బ్యూరో, నంద్యాల .