వైసీపీ జడ్పిటిసి అభ్యర్థి ముమ్మర ప్రచారం
మర్రిపాడు, మేజర్ న్యూస్ : మర్రిపాడు మండలంలోని పలు గ్రామాల్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు శనివారం ముమ్మర ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వైసీపీలో జడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి సిద్ధంరెడ్డి వెంకటరమణమ్మ తన భర్త సిద్ధంరెడ్డి మోహన్ రెడ్డితో పాటు వైసీపీ శ్రేణులతో కలసి మండల పరిధిలోని నందవరం, రామానాయుడుపల్లి, పొంగూరు, రాంపల్లి, భీమవరం తదితర గ్రామాల్లో ప్రచార పర్యటన జోరుగా సాగించారు. ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆశీస్సులతో బలపరిచిన తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు వివరించారు. అందువలన మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలంటూ కరపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, మాజీ కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు, వైసీపీ నాయకులు అంబటి కృష్ణారెడ్డి, దుగ్గి రెడ్డి కృష్ణప్రసాద్ రెడ్డి, చెవుల శ్రీనివాసుల యాదవ్, నూనె ప్రసాద్ యాదవ్, రామానాయుడుపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు నాయుడు, ఒంటెద్దు కృష్ణారెడ్డి, భీమవరం సొసైటీ మాజీ ప్రెసిడెంట్ సోమల మాధవరెడ్డి, దుద్దుగుంట రవికుమార్ రెడ్డి, బొర్రా విష్ణువర్ధన్ రెడ్డి తదితర నాయకులు , కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు.