BREAKING
‘అర్నబ్‌’ తుపానును ఎదుర్కొనేందుకు విధుల్లో 6 వేల మంది విద్యుత్‌ సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవి మోడీపై కుట్రలు చేస్తే సహించేది లేదు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ కుమార్ రామాయంపేటలో ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు నటి నజ్రియా అందాల ఆరబోత.. ఫహాద్‌తో విడాకుల ప్రచారాలపై జోరుగా చర్చ సబ్సిడీపై పెసర, మినుము విత్తనాలు దామర చెరువులో ఇంకుడు గుంతల నిర్మాణం సర్పంచ్ గీతాంజలి డానియల్ ప్రజలు తుఫాన్ పట్లు అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం జడ్పీటీసీ అభ్యర్థులకు బీ ఫారాల పంపిణీ జడ్పీటీసీ అభ్యర్థిగా చీపురుపల్లి బరిలో వలిరెడ్డి శ్రీనివాస నాయుడు ...టీడీపీ తరుపున బీఫాo అందజేత..… బీసీ’ విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండండి : బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం శివాలయం వద్ద సీసీ నిర్మాణం పనులు అశ్వారావుపేటలో అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసుల దాడి - ఏడుగురి అరెస్ట్, 7 ట్రాక్టర్లు సీజ్* తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి : ఇంకొల్లు తహశీల్థారు ఏ.వి.యస్‌ శ్రీనివాస్‌ తీరం దిశగా తీవ్ర తుఫాను 'అర్నబ్': రేపు యానాం వద్ద తీరం దాటే అవకాశం రైతులకు అండగా ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రగతి ధర్మారం గ్రామంలో కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్

వైద్య సేవలు

Select Suryaa Now
వైద్య సేవలు

ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి

అర్నబ్‌ తుపాను నేపథ్యంలో ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది సెలవులను రద్దు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,441 అత్యవసర పడకలు, 1,050 వైద్య బృందాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1,892 ప్రభుత్వ అంబులెన్సులు, 367 ప్రైవేటు అంబులెన్సులను కలిపి మొత్తం 2,259 వాహనాలను రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌ (ఆర్టీజీఎస్‌)తో అనుసంధానించారు. అవసరమైన ప్రాంతాలకు అంబులెన్సులను వెంటనే పంపించేలా చర్యలు చేపట్టారు. పాముకాటు చికిత్స కోసం 26,500 విరుగుడు ఇంజెక్షన్లతో పాటు అత్యవసర మందులను అందుబాటులో ఉంచారు. తుపాను ప్రభావం అధికంగా ఉండే 20 జిల్లాల్లోని 96 మండలాల పరిధిలో ఉన్న 1,176 ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారించారు. వర్షాలు, గాలుల తీవ్రతపై హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు 20 జిల్లాల్లోని 255 మండలాల వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. 38 సహాయక శిబిరాల్లో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రసవ తేదీ దగ్గర్లో ఉన్న 2,838 మంది గర్భిణులను ముందస్తుగా సమీప ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడితే వైద్య సేవలకు ఆటంకం కలగకుండా జనరేటర్లు, ఇంధనాన్ని సిద్ధం చేశారు. తుపాను అనంతరం అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యం, తాగునీటి నాణ్యత పరీక్షలు, అవసరమైన మందుల సరఫరాపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. తుపాను సన్నద్ధతపై మంగళవారం సాయంత్రం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో అధికారులు, వైద్యులు 24 గంటలూ అందుబాటులో ఉంటారని అధికారులు మంత్రికి వివరించారు.

ఎం.గణేశ్, స్టేట్ బ్యూరో ఇన్ చార్జి