వాగ్దానంనిలబెట్టిన నేత ప్రజల గుండెల్లో నిలిచిన నేత చంద్రబాబు.
ఆచరణలో చూపిన ధీరుడు ఇచ్చిన మాటకు కట్టుబడి నాయకుడు లోకేష్.
ప్రతి అడుగులో ప్రజల ప్రాధాన్యం మాటలతో కాదు చేతులతో చూపిస్తున్న కూటమి ప్రభుత్వం.
చెప్పాం… చేస్తున్నాం” పోస్టర్ ఆవిష్కరించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
సూర్య న్యూస్ దర్శి. ప్రజలకు చేసిన వాగ్దానం నిలబెట్టిన నేత ప్రజల గుండెల్లో నిలిచిన నేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుఅని, ఆచరణలో చూపిన ధీరుడు పుట్టిన మాటకు కట్టుబడి నాయకుడు మంత్రి లోకేష్ అని నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు.
దర్శి లోని టీడీపీ కార్యాలయం నందు “చెప్పాం… చేస్తున్నాం” ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెబుతూ, అభివృద్ధి–సంక్షేమం కొనసాగేందుకు స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతు కోరుతున్నం అని తెలియజేసి పోస్టర్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ మెగా డీఎస్సీతో యువతకు టీచర్ పోస్టులు ఇస్తామని 'చెప్పాం'.... మెగా డీఎస్సీ 2025తో 16,000 టీచర్ పోస్టులు ఇచ్చాం... ఈ ఏడాది మరో డిఎస్సీతో మరిన్ని పోస్టుల భర్తీ 'చేస్తున్నాం' అన్నారు.
అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్ లింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేస్తామని నాడు యువగళంలో మాట ఇచ్చాం. చెప్పినట్టే రెండో సంతకం చేసి ల్యాండ్ టైట్ లింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని నాడు మాట ఇచ్చాం. చెప్పిన మాట ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభించి రూ.5కే లక్షలాది పేదలు, అభాగ్యుల కడుపు నింపుతున్నామన్నారు
అన్నదాత సుఖీభవ.. చెప్పాం.. చేస్తున్నాం!
ఏటా ₹20,000 ఇస్తామని హామీ ఇచ్చాం.. అధికారంలోకి రాగానే అమలు చేస్తున్నాం!
రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతున్నామన్నారు.
తల్లికి వందనం.. హామీ ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం
ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఆర్థిక భరోసా కల్పిస్తూ.. విద్యకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచిందన్నారు.హామీ నుంచి అమలు వరకు.. ప్రతి అడుగులో ప్రజలే ప్రాధాన్యం..
మాటలతో కాదు.. చేతలతో చూపిస్తున్నాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హామీలను నెరవేరుస్తూ.. నమ్మకానికి కొత్త అర్థం చెబుతున్నామని డాక్టర్ లక్ష్మి అన్నారు.
ఈ కార్యక్రమం లో దర్శి ఏఎంసి చైర్మన్ దారం నాగవేణి - సుబ్బారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి నియోజకవర్గం లోని వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ నాయకులు ఉన్నారు.