BREAKING
డోకూరు లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కొర్రపాటి కిరణ్ జన్మదిన సందర్భంగా దివ్యాంగులకు గృహపకరణాలు పంపిణీ ఆర్థిక సాయం ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కుర్ని దైవాచార సంఘం ప్రతినిధికి బుట్టా పరామర్శ ఉట్కూరు గురుకుల పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు: చంద్రబాబు ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి ముగిసిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా స్థాయి పోటీలు రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం - ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కొందుర్గు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాడిగల్ల మహేందర్ కొత్తచెరువు సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో కు వినతి రూ.1,789.52 కోట్లతో ఐటీఎంఎస్‌.. 42 ప్రధాన ట్రాఫిక్‌ కారిడార్లలో అమలు హరిహరులను విభజించే హక్కు ఎవరిచ్చారు కరీంనగర్‌లో నూతన కలెక్టరేట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాఫీ విత్ కరణ్ షోకు తెరదించిన కరణ్ జోహార్.. సెలెబ్రిటీ కెరీర్‌లను ముగించిన ఐకానిక్ టాక్ షో ముగింపు

ఉరవకొండలో నూతన పాఠశాల కమిటీల చైర్మన్లు, సభ్యులతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ

Select Suryaa Now
ఉరవకొండలో నూతన పాఠశాల కమిటీల చైర్మన్లు, సభ్యులతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ

 

అనంతపురం బ్యూరో: ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వ పాఠశాల కమిటీల చైర్మన్లు, సభ్యులు బుధవారం రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఉరవకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నూతనంగా ఎన్నికైన పాఠశాల కమిటీల చైర్మన్లు, సభ్యులకు మంత్రి పయ్యావుల కేశవ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో పాఠశాల కమిటీల పాత్ర కీలకమని పేర్కొంటూ, విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

పిల్లలను ఉన్నతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు పాఠశాలల్లో అనుకూలమైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని మంత్రి తెలిపారు. పాఠశాలల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, విద్యార్థుల విద్యా ప్రమాణాల మెరుగుదలకు పాఠశాల కమిటీలు చొరవ చూపాలని సూచించారు.

నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు, సభ్యులు పాఠశాలల అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.