BREAKING
ప్రతి విద్యార్థిలో భాషా, గణిత నైపుణ్యాలు పెంపొందించాలి - కలెక్టర్ కోయ శ్రీహర్ష ఎన్నికలు నిర్వహణలో ఎస్ఈసీ విఫలం....భీశెట్టి సైదాబాద్‌లో చైన్ స్నాచర్ అరెస్ట్ 17.160 గ్రాముల బంగారు గొలుసు, బైక్ స్వాధీనం మురసు తూఫాన్ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి: గొట్టిపాటి లక్ష్మీ. రాంపల్లిలో రూ.40 లక్షలతో డ్రైనేజీ పనులకు శ్రీకారం ఘనంగా ‘చాణక్య’ టీజర్ లాంచ్: ఎస్‌ఏ ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో ఆవిష్కరణ! టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి సీనియర్ నాయకుల చేరిక.. కౌంట్ డౌన్.... * ఉదయం 8 నుంచి ప్రారంభం * మల్లిపల్లి కూటమిలో చేరిన 11 కుటుంబాలు. ఇటలీలో పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పోస్టులకు భారీగా కోత క్రికెట్, ఎనర్జీతో ‘హై’ మూవీ ప్రమోషనల్ సాంగ్ ‘దమ్ములుంటే’ విడుదల: యూత్‌ను ఆకట్టుకుంటున్న బీట్స్! నవంబర్ 30న తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం కావాలి - రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి... * కార్మిక సహాయ అధికారి జయశంకర్ * పలాస-కాశీబుగ్గ ప్రజా తీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... * మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు * పీడీఎస్‌ సన్నబియ్యం అక్రమ నిల్వ.. - ఆరు క్వింటాళ్లు పట్టివేత

ఉప్పాడ తుఫాను బాధితులకు సింహాద్రి టీఎంటీ చేయూత

Select Suryaa Now
ఉప్పాడ తుఫాను బాధితులకు సింహాద్రి టీఎంటీ చేయూత

గాజువాక, సూర్య :  ‘అర్నబ్’ తుఫాన్ ధాటికి అతలాకుతలమైన కాకినాడ జిల్లా ఉప్పాడ సముద్ర తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ‘సింహాద్రి టీఎంటీ’ సంస్థ మానవత్వంతో అండగా నిలిచింది. తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులకు దుప్పట్లు, టవల్స్, బ్రెడ్లు, బిస్కెట్లు, రస్కులు, వాటర్ బాటిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ ఎండీ బండి సురేష్ కుమార్, డైరెక్టర్ వి.వి. కృష్ణారావు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని, త్వరలో మరిన్ని ప్రాంతాల్లోనూ సహాయం అందిస్తామని తెలిపారు. గత పదేళ్లుగా వరద సహాయక చర్యలతో పాటు మొక్కలు నాటడం, ఉచిత వైద్య శిబిరాలు, మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన వంటి సేవా కార్యక్రమాలను సొంత నిధులతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హిమ హ్యుమానిటేరియన్ అసోసియేషన్ ఫౌండర్ సెక్రెటరీ టి.వి.డి. దాస్, జాయింట్ సెక్రెటరీ జి.వి. హరి, కాకినాడ అడ్వకేట్ సత్యదేవి తదితరులు పాల్గొన్నారు. తమను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సింహాద్రి టీఎంటీ యాజమాన్యానికి ఉప్పాడ మత్స్యకార కుటుంబాలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.