ఉద్యోగులు ఎన్నికల ప్రవర్తనా నియమాళిని పాటించాలి.
ఉద్యోగులు ఎన్నికల ప్రవర్తనా నియమాళిని పాటించాలి.
ఉదయగిరి, మేజర్ న్యూస్.
ఎన్నికల విధులకు హాజరవుతున్న సిబ్బంది ఎన్నికల కమీషన్ ప్రవర్తనా నియమావళిని అనుసరించి విధులు నిర్వహించాలని ఎంపీడీవో సుకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మం డల పరిషత్ కార్యాలయంలో పీవో, ఏపీవోలకు మాస్టర్ ట్రైనీలు సమీవుల్లా, ఫణిరాజు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే ఉన్నతాధికారులకు వెంటనే తెలియజేయాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతిఒక్కరు సహకరించాలన్నారు.