తుఫాన్ ప్రభావిత ప్రాతాలలో పునరుద్ధరణ పనులు ముమ్మరం...
తుఫాన్ ప్రభావిత ప్రాతాలలో పునరుద్ధరణ పనులు ముమ్మరం... అమలాపురం, మేజర్ న్యూస్ తుఫాన్ ప్రభావంతో అతలాకుతలమైన అమలాపురం పట్టణంలో పునరుద్ధరణ పనులను అధికారులు ముమ్మరం చేశారు. మున్సిపల్ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో కూలిపోయిన చెట్లను తొలగించి రహదారులను క్లియర్ చేయడంతో పాటు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, పారిశుద్ధ్య పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు కలగకుండా, సాధారణ జనజీవనం త్వరగా పునరుద్ధరించేలా చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పునరుద్ధరణ కార్యక్రమాలను అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలిస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయడంపై దృష్టి సారించారు