BREAKING
-నియామకమైన సందర్భంగా శ్రీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నూతన సుగుణ చికెన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చేర్మెన్ ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే జిఎంఆర్ రాష్ట్రానికి మరో తుపాను దృష్ట్యా ముందస్తు చర్యలు కూటమి అరాచక పాలనను తరిమేద్దాం --మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపు గుండె శస్త్రచికిత్స చేయించుకున్న అంజయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు గుర్రపు మచ్చేందర్ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి ప్రాచీన్ గ్లోబల్ హాస్పిటల్ ప్రారంభించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తాకు పద్మశ్రీ లేదా పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శ్రీనివాసవర్మ విస్తృత ప్రచారం రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లుమారేపల్లి సొసైటీ చైర్మన్‌ రాజు బొల్లారంలో ఇందిర గాంధీ వర్ధంతి వేడుకలు గుట్టపాడులో టీడీపీ ఎన్నికల ప్రచారం బాలికకు అండగా.. బెంగళూరుకు లోకేష్ రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై దాడి అమానుషం.. ఏపీ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయభాస్కర్

తుమ్మలూరు, కృష్ణారావుపేట గ్రామాల్లో టీడీపీ అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి

Select Suryaa Now
తుమ్మలూరు, కృష్ణారావుపేట గ్రామాల్లో టీడీపీ అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం  సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి

 

పాములపాడు మేజర్ న్యూస్:

పాములపాడు మండల పరిధిలోని తుమ్మలూరు, కృష్ణారావుపేట గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి వానమాల ప్రసాద్ రావు, జడ్పీటీసీ అభ్యర్థి రాచపూడి సురేష్ విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ముమ్మర ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీటీసీ అభ్యర్థి వానమాల ప్రసాద్ రావును, జడ్పీటీసీ అభ్యర్థి రాచపూడి సురేష్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మండల నాయకులు రామలింగేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ అభ్యర్థి ప్రసాద్, నాయకులు రామకృష్ణ, సన్నీ తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని ప్రజలకు సైకిల్ గుర్తు ప్రాధాన్యతను వివరిస్తూ ఓటర్లను కలుసుకున్నారు.

తెలుగుదేశం పార్టీకి ప్రజలు అండగా నిలిచి, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని నాయకులు పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి విజయాన్ని అందించాలని కోరారు.

తుమ్మలూరు, కృష్ణారావుపేట గ్రామాల్లో సాగిన ఈ ప్రచార కార్యక్రమంతో స్థానికంగా ఎన్నికల సందడి నెలకొంది.