స్టార్ విద్యాసంస్థల విద్యార్థుల సేవాభావం అభినందనీయం: కలెక్టర్ డీకే బాలాజీ
స్టార్ విద్యాసంస్థల విద్యార్థుల సేవాభావం అభినందనీయం: కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం, సెప్టెంబరు 21, మేజర్ న్యూస్ : స్టార్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో హెచ్‌హెచ్‌ఓ ఫండ్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్టార్ ఇన్స్టిట్యూషన్స్, సికాన్స్, స్టార్ కళాశాల విద్యార్థులు సమష్టిగా సేకరించిన రూ.2,75,223లను సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న 11 సంస్థలకు పంపిణీ చేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చేతుల మీదుగా ఒక్కో సంస్థకు రూ.25 వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజ సేవలో విద్యార్థులు చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. సేవాభావం, దయ, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలని, అవసరమైన వారికి సహాయం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు విద్యార్థుల సేవా కార్యక్రమాలను అభినందించి, భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టార్ విద్యాసంస్థల మెంటర్ పి. శ్రీరామ్, కళాశాల డైరెక్టర్ బి. అయ్యప్పస్వామి, స్టార్ కళాశాల ప్రిన్సిపల్ ఆదిత్య, సన్స్టార్ పాఠశాల ప్రిన్సిపల్ ఘౌసియా తాజ్, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. హెచ్‌హెచ్‌ఓ ఫండ్ కార్యక్రమం ద్వారా విద్యతో పాటు విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, మానవతా విలువలు, సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా స్టార్ విద్యాసంస్థలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.